Monday, September 14, 2026
Home People 31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్

31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్

0
49

📰 Generate e-Paper Clip

31 మున్సిపల్ సీట్లతో బీఎస్పీ అద్భుత ప్రదర్శన – సాకే వినయ్ కుమార్

          ధర్మవరం నుంచే దేశవ్యాప్తంగా బీఎస్పీ ఎదుగుదలపై విశ్వాసం

సత్య సాయి జిల్లా ధర్మవరం( ప్రరివర్తన అవాజ్) జనవరి17  మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీ బలమైన ప్రదర్శన మహారాష్ట్ర మున్సిపాలిటీ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) అద్భుతమైన విజయాన్ని నమోదు చేసుకుని దేశ రాజకీయాల్లో తన బలమైన ఉనికిని మరోసారి చాటుకుందని బీఎస్పీ ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జి సాకే వినయ్ కుమార్ ధర్మవరంలో మాట్లాడుతూ తెలిపారు. నాగపూర్‌లో 13, చంద్రపూర్‌లో 8, అమరావతిలో 7, షోలాపూర్, థానే,అహ్మద్‌నగర్‌లలో ఒక్కో సీటు చొప్పున మొత్తం 31 మున్సిపల్ సీట్లను బీఎస్పీ పార్టీ గెలుచుకోవడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.దేశంలో బీఎస్పీ పార్టీ పని అయిపోయిందని, పార్టీకి భవిష్యత్తు లేదని మాట్లాడిన రాజకీయ చెంచాలకు ఈ ఎన్నికల ఫలితాలు గట్టి సమాధానమని ఆయన ధర్మవరంలో మాట్లాడుతూ స్పష్టం చేశారు. బీహార్, పంజాబ్, కేరళ, తెలంగాణ, మహారాష్ట్ర రాష్ట్రాల్లో బీఎస్పీ సాధిస్తున్న వరుస విజయాలను చూస్తే విమర్శకులు తమ మాటలకే తామే సిగ్గుపడే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు.అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ధర్మవరం నియోజకవర్గంలో బహుజన సమాజ్ పార్టీ వేగంగా పుంజుకుంటూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటోందని,బహుజనుల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం బీఎస్పీ చేస్తున్న పోరాటానికి ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తోందని తెలిపారు. రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తంలోనూ బీఎస్పీ పార్టీ మరింత శక్తివంతంగా ఎదుగుతుందని ఆయన అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.