రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను అనుసరిస్తూమున్సిపాలిటీ వార్డుల మహిళా రిజర్వేషన్ ఖరారు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
పరివర్తన ఆవాస్) శనివారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో .రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ ని పారదర్శకం గా కలెక్టర్ నిర్వహించారు మెదక్
జిల్లా లోని మున్సిపాలిటీ లోని 32 వార్డు లు, నర్సాపూర్ మున్సిపాలిటీ లోని 15 వార్డు ల తూప్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులకు రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులకు మహిళ
రిజర్వేషన్ ఖరారు లో భాగంగా మున్సిపాలిటీ లకు సంబందించి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ బీసీ ల డెడికేషన్ కమిషన్ ప్రకారం, sc, st లది 2011 జనాభ లెక్కల ప్రకారం, మహిళ రిజర్వేషన్ నుజీవో 9 ప్రకారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ ద్వారా కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు
రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలకు అనుగుణంగా రిజర్వేషన్ కేటాయింపులు చేశామని ఈ సందర్బంగా కలెక్టర్ స్పష్టం చేసారు
ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ నగేష్ , ప్రత్యేక అధికారి సంధ్య,ఆర్డీవోలు , మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు
