
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లకు సంబంధించిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా డీసీసీ అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, డీసీసీ మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ ఖాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహమ్మద్ ఖాన్ మాట్లాడుతూ, రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో మైనార్టీలకు తగిన ప్రాధాన్యం ఇచ్చి అవకాశం కల్పించాలని కోరారు. అలాగే ప్రతి డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మైనార్టీ నాయకులు సమిష్టిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎండి కరీం పాషా, జిల్లా సెక్రటరీ గౌస్ పాషా, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఇబ్రహీం, నియోజకవర్గ అధ్యక్షులు గౌస్ మొయినుద్దీన్, కొత్తగూడెం టౌన్ మైనార్టీ అధ్యక్షులు ఎండి ఖాజా బక్ష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దావూద్, ఉపాధ్యక్షులు అక్బర్ భాయ్, ప్రధాన కార్యదర్శి ఖమర్ ఖాదర్, పాల్వంచ మైనార్టీ మండల అధ్యక్షులు కాజామియా, సీనియర్ మైనార్టీ నాయకులు అప్సర్ ఖాన్, రహమాన్ ఖలీల్, చుంచుపల్లి వార్డు మెంబర్ ఆఫ్రిన్, 13వ డివిజన్ ప్రతినిధి షబానా, మైనార్టీ యువజన నాయకులు నయీమ్ అల్లాబక్ష్, క్రిస్టియన్ మైనార్టీ నాయకులు సంపత్ విల్సన్ కన్ను తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
సమావేశం విజయవంతంగా ముగిసిందని పార్టీ నాయకులు తెలిపారు.
