Monday, September 14, 2026
Home Politics నినాదం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

నినాదం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్

0
41
IMG-20260113-WA07521

📰 Generate e-Paper Clip

జన “నినాదం”మై వినిపించాలి…ప్రజాస్వరం మరింత బలపడాలిజిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

పరివర్తన అవాజ్,కొత్తగూడెం
ప్రజల సమస్యలు, ఆశలు, ఆకాంక్షలకు అద్దం పట్టేలా జన “నినాదం”మై వినిపించాలని, ప్రజా సమస్యల పరిష్కార సంకల్పంతో నడుస్తున్న నినాదం తెలుగు దినపత్రిక క్యాలెండర్‌ను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్టాఫ్ రిపోర్టర్ జల్ది శామ్ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ క్యాలెండర్‌ను ఆవిష్కరించి నినాదం పత్రిక బృందానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, ముఖ్యంగా ప్రజల నినాదాన్ని అధికార వ్యవస్థల దృష్టికి తీసుకువెళ్లడంలో నిష్పక్షపాత జర్నలిజం అవసరం ఎంతో ఉందని పేర్కొన్నారు. నినాదం పత్రిక ప్రజాసమస్యలపై నిరంతరం స్పందిస్తూ, బాధ్యతాయుత పాత్ర పోషించడం అభినందనీయమన్నారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నినాదం పత్రిక ప్రజాసేవా ప్రయాణంలో మరో మైలురాయిగా నిలిచింది. ప్రజల గొంతుగా, జనసమస్యల ప్రతిధ్వనిగా నినాదం మరింత ముందుకు సాగాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఆర్సీ హరికృష్ణ, ఆయా మండలాల విలేకరులు తదితరులు పాల్గొన్నారు.
ప్రముఖుల ప్రశంసలు..
నినాదం పత్రిక క్యాలెండర్‌ ఆవిష్కరణ చేసిన అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సంగం వెంకటపుల్లయ్య, గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు పత్రిక సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా ప్రజల తరఫున ప్రశ్నించే వేదికగా నిలవాలని, నిజాయితీతో ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పత్రికలే సమాజాన్ని ముందుకు నడిపిస్తాయని పేర్కొన్నారు. ప్రత్యేకంగా నినాదం పత్రిక గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల నినాదాన్ని అధికార యంత్రాంగానికి చేరవేస్తూ బాధ్యతాయుత పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అలాగే, సమాజ హితం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా జర్నలిజం సాగినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
భవిష్యత్తులోనూ నినాదం పత్రిక ఇదే ప్రజాపక్ష ధోరణితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.