మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని సర్పంచ్ బలరాం విజ్ఞప్తి
పరివర్తన అవాజ్,కొత్తగూడెం
నందా తండా గ్రామపంచాయతీలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రేపు ముగ్గుల పోటీలను నిర్వహించనున్నట్లు సర్పంచ్ మాలోత్ బలరాం తెలిపారు. ఈ పోటీల్లో గ్రామానికి చెందిన మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా నిర్వహించబడతాయని, ప్రతిభ కనబరిచిన విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మహిళల్లో దాగి ఉన్న కళాత్మక నైపుణ్యాలను ప్రోత్సహించడం లక్ష్యమని అన్నారు.
గ్రామ ప్రజలు, మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని పెద్ద సంఖ్యలో హాజరై ముగ్గుల పోటీలను విజయవంతం చేయాలని సర్పంచ్ మాలోత్ బలరాం కోరారు.
