జయప్రదం చేయాలి శేషగిరి నగర్‌లో వాల్ పోస్టర్ ఆవిష్కరణ
పరివర్తన ఆవాజ్,కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ గ్రామపంచాయతీలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 100 సంవత్సరాల ముగింపు సభ సందర్భంగా జనవరి 18న నిర్వహించనున్న భారీ బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా శేషగిరి నగర్‌లో వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పల్లి మండల సీపీఐ కార్యదర్శి లక్ష్మీపతి, సహాయ కార్యదర్శి దారా శ్రీను, యువజన సంఘం నాయకుడు సాయి, జిల్లా కౌన్సిల్ సభ్యురాలు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కరిష రత్నకుమారి, ఉప సర్పంచ్ రామ్ రెడ్డి, వార్డు సభ్యులు ధర్మ, రాములు, గ్రామ సీపీఐ కార్యదర్శి అంబేద్కర్ పాల్గొన్నారు.
అలాగే బానోత్ శాంతి, పాకాల లక్ష్మి, రేణిగుంట్ల లక్ష్మి, మదనమ్మ, కుంటి పుష్ప, రాజమణి, వెంకట నరసమ్మ, జై మునిసా తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సీపీఐ పార్టీ 100 ఏళ్ల పోరాట చరిత్ర ప్రజల హక్కుల కోసం సాగిందని, జనవరి 18న జరిగే భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
