ఈనెల 24న జరుగు ధర్నాను జయప్రదం చేయాలి. సిఐటియు
పరివర్తన ఆవాజ్. నవంబర్ 21 మహబూబాబాద్, బయ్యారం. మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు వెంటనే చెల్లించాలని ఈ నెల 24న ధర్నాను జయప్రదం చేయాలి..,….. సిఐటియు మండల కన్వీనర్ వల్లాల వెంకన్న. శుక్రవారం స్థానిక ఎంఆర్సి ఆఫీస్ నందు ఎం ఈ ఓ దేవేంద్ర చారి కి మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి మెమోరాండం ఇవ్వడం జరిగినది. అనంతరం సంగిశెట్టి ఆదిశేషులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మండల కన్వీనర్ వల్లాల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ గత ఆరు నెలలుగా మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు చెల్లించడం లేదని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పి కార్మికుల యొక్క శ్రమ దోపిడీ చేస్తున్నారు. నూతన చట్టాలను పేరుతోటి నాలుగు లేబర్ కోడ్లను ఏర్పాటు చేసి కార్మిక హక్కులను కాలరాస్తుందని వారుఎద్దేవ చేశారు . కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికులకు మూడువేల వేతనం ఇస్తామని ప్రకటించి నేటి వరకు అమలు చేయలేదని వారు విమర్శించారు.ఇచ్చిన మెనూ ప్రకారం పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా బిల్లులు చెల్లించాలని. పెరిగిన గుడ్ల ధర కనుగుణంగా బిల్లులు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈనెల 28 29 మరి పేడలో జరుగు సిఐటియు 4వ జిల్లా మహాసభను జయప్రదం చేయాలని .ఈ నెల 24న మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారానికి జరుగు ధర్నాను జయప్రదం చేయాలని కార్మికులకువారు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో పి చంద్రమౌళి యశోద, ఎన్. ఉపేంద్ర. ఎం లక్ష్మి ,బి .విజయ తదితరులు పాల్గొన్నారు.

