ప్రజా పోరాటాలతో పునీతమైన ఎర్రజెండ.
Cpi జాతీయ నాయకులు మాజి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
పరివర్తన ఆవాజ్ నవంబర్ 21 మహబూబాబాద్ , సిపిఐ 100 సంవత్సరాల ప్రచార బస్సుజాతకు సిపిఐ గార్ల మండల సమితి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. గార్ల పురవీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం గార్ల నెహ్రూ సెంటర్లో నిర్వహించిన ప్రచార సభలో సిపిఐ జాతీయ నాయకులు మాజి ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ప్రజా పోరాటాలతో ఎర్రజెండా పునీతమైందని వంద ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో ప్రజాఉద్యమాలకు నాయకత్వం వహించిన ఘన చరిత్ర సిపిఐ పార్టీది అని అన్నారు.సిపిఐ 100వ వార్షికోత్సవాల ప్రచార జాత ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత 100 సంవత్సరాలుగా భారత దేశంలో జరిగిన అన్ని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ఏకైక పార్టీ సిపిఐ అని స్వాతంత్ర పోరాటమైనా, తెలంగాణ సాయుధ పోవడమైనా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమమైనా అన్ని ఉద్యమాలకు నాయకత్వం వహించి ప్రజలకు అండగా నిలబడి బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన పార్టీ సిపిఐ అని, కొన్ని పార్టీలు ప్రజా ఉద్యమాలకు దూరంగా ఉంటూ ఏ ఉద్యమంలో పాల్గొనకుండా ప్రజలకు దూరంఅయ్యారని ఆ పార్టీల చరిత్ర ముగిసిపోయిందని కానీ అధికారం ఉన్నా లేకపోయినా ఓట్లతో సీట్లతో సంబంధం లేకుండా, రైతాంగ ఉద్యమాలు వ్యవసాయ ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు యువజన ఉద్యమాలు మహిళా ఉద్యమాలు లాంటి అనేక ప్రజా ఉద్యమాలకు నాయకత్వం వహించి వందేళ్లుగా దేశంలోని 29 రాష్ట్రాల్లో శాఖలు కలిగి ఉన్న ఏకైక పార్టీ సిపిఐ ఆయన సగర్వంగా ప్రకటించారు.కార్మిక రంగ ఉద్యమాలలో ముందున్న పార్టీ సిపిఐ అని అన్నారు.భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిరంకుశ నిజామును గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణాల త్యాగాలతో మూడు వేల గ్రామాలకు విముక్తి కలిగించి పది లక్షల ఎకరాల భూములు పంచిన ఘన చరిత్ర భారత కమ్యూనిస్టు పార్టీది అని ఆనాటి సాయుధ పోరాటమే అనేక ఉద్యమాలకు నాంది అయిందని అనేకమంది వీరులకు జన్మనిచ్చిందని ప్రపంచానికి పోరాటం నేర్పింది భారత కమ్యూనిస్టు పార్టీ అని ఆయన అన్నారు. జాతాలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్ళపల్లి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవలేని శంకర్, సిపిఐ జిల్లా కార్యదర్శి బి విజయ సారథి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు అజయ్ సారధి రెడ్డి కట్టబోయిన శ్రీనివాస్ జంపాల వెంకన్న, బయ్యారం మండలం కార్యదర్శి సారిక శ్రీనివాస్,మనికంటా రెడ్డి,మారుపాక అనిల్ కుమార్, రెహమాన్, పోతుల నరసింహారావు, పెరుగు కుమార్ ,మాగం లోకేష్, నాదెండ్ల పద్మ,రాగం రమేష్, తదితరులుపాల్గొన్నారు.


