రంగారెడ్డి జిల్లాలో వలస కార్మికుడి దారుణ హత్య?
పరివర్తన అవాజ్ నవంబర్ రంగారెడ్డి జిల్లా: నవంబర్11 .రంగారెడ్డి జిల్లా కొత్తూరు మున్సిపాలిటీ కేంద్రంలో బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం అర్ధరాత్రి దారుణ హత్యకు గురయ్యాడు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన శంసు అనే వ్యక్తి జీవనో పాధి నిమిత్తం కొంతకాలం క్రితం కొత్తూరుకు వలస వచ్చాడు. కొత్తూరులో తాపీ మేస్త్రీగా పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో కొత్తూరు మండల కేంద్రంలోని పెద్దమ్మ తండా రోడ్డుకు ఆనుకుని ఉన్న వింటేజ్ వెంచర్ లో నిద్రిస్తు న్న చోటే రక్తం మడుగులో పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కొత్తూరు ఇన్స్పెక్టర్ జి.నర్సయ్య సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ఈ హత్యకు సంబంధించిన సమాచారం తెలియవలసి ఉంది.

