Monday, November 23, 2026
Home People మానవత్వానికి మారుపేరు.. ఎల్లారెడ్డి ఎస్సై రాజు

మానవత్వానికి మారుపేరు.. ఎల్లారెడ్డి ఎస్సై రాజు

0
3

📰 Generate e-Paper Clip

విధిల నిర్వహణలో నిబద్ధత ప్రజాసేవలో మానవత్వం ఎల్లారెడ్డి మండల ప్రజలు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎల్లారెడ్డి ఎస్సై రాజు

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరివర్తన అవాజ్ : ఎల్లారెడ్డి మండలంలోని ఆ పోలీస్ స్టేషన్. కాకి దుస్తులు వేసుకుంటేనే కఠినంగా ఉండాలని రూల్ ఎక్కడా లేదని. ఆ కాకి వెనుక కూడా మానవత్వం. సేవాగుణం ఉంటాయని నిరూపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎస్సై రాజు పోలీస్ శాఖలో ఉన్న విధులను అత్యంత నిబద్ధతతో నిర్వహిస్తూ ప్రజలకు సేవ చేసే గుణంతో మండల ప్రజలు అభిమానాన్ని చురగొంటున్నారు. పోలీస్ శాఖలో అప్పగించిన ప్రతి వీధిని తూచతప్పకుండా నిర్వహించడంలో ఎస్సై రాజు ముందుంటారు. మండలంలోని శాంతిభద్రతల పరిరక్షణ. నేర నియంత్రణ. అక్రమ కార్యకలాపాల అరికట్టడం. రాత్రి గస్తీ నిర్వహణ వంటి విధులన్నిటిని అత్యంత అప్రమత్తంగా నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు స్టేషన్ కే పరిమితం కాకుండా ఫీల్డ్ లో ఉంటూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు పోలీస్ ఉద్యోగం అంటే కేవలం కేసులు పెట్టడమే కాదు ప్రజలకు సేవ చేయడం అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారు అందుకే స్టేషన్ కు వచ్చే ప్రతి బాధితుడిని తన కుటుంబ సభ్యులు ఆదరిస్తారు వృద్ధులు. మహిళలు. పేదలు సమస్యలను ప్రత్యేక శ్రద్ధతో వింటూ.వారికి న్యాయం చేసేందుకు కృషి చేస్తారు. ఆయనలోని ఈ సేవ గుణమే మండల ప్రజలను ఆకట్టుకుంటుంది నేరస్తుల పట్ల ఆ సాంఘిక శక్తుల పట్ల ఎక్కడ రాజీ పడకుండా కఠినంగా వ్యవహరిస్తారు. అదే సమయంలో అమాయకులు. బాధితుల పట్ల మృదువుగా. మానవత్వంతో వ్యవహరిస్తారు. ఈ సమతుల్య పోలీస్ సింగ్ వల్లనే ఎల్లారెడ్డి మండలంలోని నేరాల గణనీయంగా తగ్గాయని ప్రజలు చెబుతున్నారు. మండలంలోని యువత మత్తుపదార్థాలు.గంజాయి. పేకాట వంటి చెడు వ్యసనాల బారిన పడకుండా ఆయన ప్రత్యేక కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు.కళాశాలలల్లో అవగ్రహణ సదస్సులు పెట్టి యువతను చైతన్యవంతులను చేస్తున్నారు. యువతకు ఆయన ఒక మార్గదర్శగా. ఒక అన్నగా మారారు. ఆయన నిజాయితీ నిబద్ధత. సేవా గుణాన్ని చూసి జిల్లా ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రజల నుండి వస్తున్న అభిమానం అధికారుల నుండి వస్తున్న ప్రశంసలు ఆయనను మరింత బాధ్యతగా పనిచేసేలా చేస్తున్నాయి. ఇలాంటి ఆఫీసర్లు ఉంటే పోలీస్ శాఖపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని మండల ప్రజలు కొనియాడుతున్నారు. ఇలా విధులను సక్రమంగా నిర్వహిస్తూ. ప్రజాసేవ గుణంతో ముందుకు సాగుతున్న ఎల్లారెడ్డి ఎస్సై రాజు మరిన్ని ఉన్నత శిఖరాలను ఎదగాలని ఎల్లారెడ్డి మండల ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఈ వార్త జర్నలిస్ట్ గైని శ్రీకాంత్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.