Thursday, September 24, 2026
Home People వర్షంలోనూ భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రక్రియ సజావుగా నిర్వహణ… -జిల్లా కలెక్టర్ సత్య శారదా….

వర్షంలోనూ భక్తులకు ఇబ్బందులు లేకుండా నిమజ్జన ప్రక్రియ సజావుగా నిర్వహణ… -జిల్లా కలెక్టర్ సత్య శారదా….

0
2

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక సెప్టెంబర్ 23

వరంగల్ నగరంలోని ఉరుసుగుట్ట చెరువు నిమజ్జన ప్రాంతాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న సందర్శించి, వర్షం కురుస్తున్న నేపథ్యంలో నిమజ్జన ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భక్తుల సౌకర్యం, భద్రతకు చేపట్టిన ఏర్పాట్లను పరిశీలిస్తూ, వర్షం కారణంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో నిమజ్జనానికి తరలివచ్చే ప్రజలకు సురక్షితమైన వాతావరణం కల్పిస్తూ, నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.