Thursday, September 24, 2026
Home People చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత, జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న…...

చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత, జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న… *నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశం

0
6

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక , సెప్టెంబర్ 24  

వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న గణేశ్ నిమజ్జన ప్రక్రియను వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ శ్వేత, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న తీరు, భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఇప్పటివరకు నిమజ్జనం పూర్తయిన గణేశ్ విగ్రహాల సంఖ్య, ఇంకా నిమజ్జనం చేయాల్సిన విగ్రహాల వివరాలను సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వర్షం కురుస్తున్న నేపథ్యంలో గణేశ్ విగ్రహాలను సాధ్యమైనంత త్వరగా నిమజ్జన కేంద్రాలకు తీసుకువచ్చి నిమజ్జనం పూర్తిచేసుకునేలా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులకు సూచించాలని అధికారులను ఆదేశించారు.వర్షం కారణంగా భక్తులు, నిర్వాహకులు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిమజ్జన కేంద్రాల వద్ద అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైన చోట తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సీపీ శ్వేత, కమిషనర్ వెంకన్న సూచించారు. పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, వైద్య ఆరోగ్య, రెవెన్యూ తదితర శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా, సురక్షితంగా పూర్తయ్యేలా చూడాలని కోరారు.అదేవిధంగా నిమజ్జనం పూర్తైన వెంటనే విగ్రహాల అవశేషాలు, ఇతర వ్యర్థాలను తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండాలని కమిషనర్ వెంకన్న ఆదేశించారు.ఈ పరిశీలనలో GWMC సూపరింటెండెంట్ ఇంజనీర్ రాజ్‌కుమార్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేష్, l ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.