చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన వరంగల్ సీపీ శ్వేత, జిడబ్ల్యుఎంసి కమిషనర్ వెంకన్న… *నిమజ్జనం పూర్తయ్యే వరకు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశం

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక , సెప్టెంబర్ 24   వరంగల్ నగరంలోని చిన్నవడ్డేపల్లి చెరువు వద్ద కొనసాగుతున్న గణేశ్ నిమజ్జన ప్రక్రియను వరంగల్ సిటీ పోలీస్ కమిషనర్ శ్వేత, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వెంకన్న గురువారం ఉదయం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిమజ్జన ప్రక్రియ కొనసాగుతున్న తీరు, భక్తుల రాకపోకలు, భద్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సందర్భంగా ఇప్పటివరకు నిమజ్జనం పూర్తయిన గణేశ్ విగ్రహాల సంఖ్య, ఇంకా నిమజ్జనం చేయాల్సిన విగ్రహాల వివరాలను సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు....