
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 55వ డివిజన్లో జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వేముల అశోక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఆయనకు విశేష ఆదరణ చూపుతూ బ్రహ్మారథం పడుతున్నారు.
ప్రచారం సందర్భంగా వేముల అశోక్ మాట్లాడుతూ, తాను గెలిస్తే డివిజన్లో ఎలాంటి అవినీతి లేకుండా పారదర్శక పాలన అందిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలకు అవసరమైన తాగునీటి సమస్యలు, రోడ్ల నిర్మాణం, సీసీ డ్రైన్ల ఏర్పాటు, కరెంట్ సమస్యల పరిష్కారం, అవసరమైన సర్టిఫికెట్ల సౌకర్యం, కమ్యూనిటీ హాల్ అభివృద్ధి వంటి ప్రాథమిక వసతులపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు.
55వ డివిజన్ ప్రజలకు ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని వేముల అశోక్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో గెలిచి డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.
