
ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రం అందజేత
కొత్తగూడెం, పరివర్తన అవాజ్ :
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 53వ డివిజన్‌కు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ అభ్యర్థిగా పల్లపు వెంకటేశ్వర్లు గురువారం అధికారికంగా నామినేషన్ పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పల్లపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే 53వ డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఆమోదంతో ప్రజలకు మరింత చేరువై పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని పల్లపు వెంకటేశ్వర్లకు మద్దతు ప్రకటించారు. 53వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన అభ్యర్థిత్వం కీలకంగా మారనుందని నాయకులు అభిప్రాయపడ్డారు.
