పరివర్తన అవాజ్ న్యూస్ :టేకులపల్లి,మార్చి21
మండల పరిధిలోని టేకులపల్లి మరియు గోల్యతండా గ్రామ పంచాయతీల ఉమ్మడి వారపు సంత నిర్వహణ కోసం ఈనెల 23వ తేదీన బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు సర్పంచ్‌లు బోడ బాలు నాయక్,లకావత్ నాకా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.ఒక సంవత్సరం కాలపరిమితికి గాను నిర్వహించే ఈ వేలం పాట గత సంవత్సరం టేకులపల్లి గ్రామపంచాయతీ లో జరగగా ఈ సారి సోమవారం ఉదయం 10 గంటలకు గోల్యతండా గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరుగుతుందని వారు పేర్కొన్నారు.ప్రతి సంవత్సరం వేదిక మార్పు ఉంటుంది.వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వేలం దారులు ₹50,000/-(యాభై వేల రూపాయలు)ముందస్తు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా వేలం నిర్వహించబడుతుందని,వేలం దారులు నిర్ణీత సమయానికి హాజరుకావాలని వారు కోరారు. మరిన్ని వివరాలకు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.
