Tuesday, November 24, 2026
Home Crime విధి నిర్వహణలో ప్రతిభ.. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌కు ఎస్పీ ప్రశంసలు

విధి నిర్వహణలో ప్రతిభ.. స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌కు ఎస్పీ ప్రశంసలు

0
16

📰 Generate e-Paper Clip

అనకాపల్లి జిల్లా పరివర్తన అవాజ్ : బుచ్చయ్యపేట మండల పరిధిలోని గాడివారిపాకల వద్ద బుచ్చయ్యపేట నుంచి చోడవరం వెళ్లే మార్గంలో, పోలేపల్లి దారిలో గత రాత్రి ద్విచక్ర వాహనంపై కొందరు వ్యక్తులు గోనె సంచిలో మద్యం సీసాలను తరలిస్తుండగా కానిస్టేబుల్ వెంకటరావు గుర్తించి వారిని వెంబడించారు. పోలీసుల రాకను గమనించిన నిందితులు పొలం గట్టుపై గోనె సంచిని వదిలి పరారయ్యారు.సంచిని పరిశీలించగా 180 ఎంఎల్ పరిమాణం కలిగిన 144 మద్యం సీసాలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న బుచ్చయ్యపేట ఎస్ఐ మనోజ్ కుమార్ సిబ్బందితో చేరుకుని మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారైన వ్యక్తుల కోసం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.విధి నిర్వహణలో అప్రమత్తత, బాధ్యతాయుతంగా వ్యవహరించి అక్రమ మద్యం తరలింపును అడ్డుకున్న వెంకటరావును జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించడం పోలీసు శాఖలో విధి పట్ల అంకితభావానికి ప్రోత్సాహంగా నిలిచింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.