Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 16 January 2026, 8:44 am Posted by : laxman RAO

మనం దినపత్రిక క్యాలెండర్–2026 ఆవిష్కరణ చేసిన. సిపిఐ మాజీ వార్డ్ మెంబర్ మలోత్ మురళి

పాల్గొన్న చుంచుపల్లి సిపిఐ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తల

పరివర్తన అవాజ్, కొత్తగూడెం 

నందా తండా గ్రామంలో మనం దినపత్రిక క్యాలెండర్–2026ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నందా తండా సిపిఐ మాజీ వార్డ్ మెంబర్ మాలోత్ మురళితో పాటు చుంచుపల్లి మండల సిపిఐ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాలోత్ మురళి మాట్లాడుతూ, మనం దినపత్రిక నిజాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లే పత్రికగా గుర్తింపు పొందిందని అన్నారు. ప్రజా సమస్యలు, సామాన్యుల గొంతుకను ధైర్యంగా ప్రతిబింబిస్తున్న పత్రికగా మనం దినపత్రిక నిలుస్తోందని ప్రశంసించారు.

అలాగే భవిష్యత్తులోనూ మనం దినపత్రిక మరింత బాధ్యతతో మంచి వార్తలను ప్రచురిస్తూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న చుంచుపల్లి మండల సిపిఐ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలబడి నిజాయితీగల జర్నలిజాన్ని కొనసాగిస్తున్న మనం దినపత్రికకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.

క్యాలెండర్ ఆవిష్కరణ అనంతరం నాయకులు, కార్యకర్తలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు.