భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలోని 15వ డివిజన్ కార్పొరేటర్‌గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆకునూరి సుప్రియ గెలుపొందిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన భారత యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు దుర్గరాశి సతీష్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఆడేపు ప్రదీప్ కుమార్ కలిసి ఆకునూరి సుప్రియను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, 15వ డివిజన్ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై నమ్మకం ఉంచి ఆకునూరి సుప్రియను గెలిపించడం అభివృద్ధికి నాంది అవుతుందని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. కొత్తగూడెం ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ విజయంతో కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.
