
-లక్షలాది మందితో భారీ బహిరంగ సభ
– అరుణ వర్ణంగా భద్రాద్రి జిల్లా కేంద్రం
–
– భారీ హోర్డింగ్‌లు, కటౌవుట్లు, సైన్‌బోర్డులు
–
– జిల్లా నుండి 15వేల వాహనాల్లో 70వేల మంది తరలింపు
– కూనంనేని సారధ్యం, పాషా ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) భారత గడ్డపై 100సం.లు పూర్తి చేసుకున్న సందర్భంగా దేశమే గర్వించేలా ఖమ్మం గుమ్మంలో రేపు (ఆదివారం) శత వసంత ఉత్సవాల ముగింపు సభ కనీవినీ ఎరుగని రీతిలో జరగనుంది. ఇందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా హలో కామ్రేడ్ ఛలో ఖమ్మం అనే నినాదం మార్మోగుతోంది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసన సభ్యులు కూనంనేని సాంబశివరావు సారధ్యం, జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా ఆధ్వర్యంలో జిల్లాలో శత వంసత ఉత్సవాల ముగింపు సభవిజయవంతానికి పనులు పూర్తయ్యాయి.
భారత స్వతంత్రాని కంటే ముందే 1925 సం. డిసెంబర్ 26న కాన్పూరులో సిపిఐ ఆవిర్భవించింది. భారత దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని తొలూత నినదించిన ఏకైక పార్టీ సిపిఐ. బానిస సంకెళ్ల నుండి దేశ విముక్తి కోసం సిపిఐ రాజీలేని పోరాటం సాగిస్తుండటంతో తట్టుకోలేని బ్రిటీష్ పాలకులు ఆ రోజుల్లో పార్టీపై నిషేదాన్ని విధించారు. పలు రకాల కుట్ర కేసులు పెట్టి నాయకులను జైళ్ల పాలు చేశారు. అయినప్పటికీ ఎక్కడ బెనుకు; తొనుకు లేకుండా కార్మిక, విద్యార్ధి, యువజ, రైతు, మహిళా, తదితర ప్రజా సంఘాలను బలంగా నిర్మించి వెట్టి చాకిరీ, దోపిడీ విముక్తి కోసం రాజీలేని పోరాటాలు సిపిఐ నిర్వహించింది. ఆ నాటి నుండి నేటి వరకు అనేక పోరాటాలు, త్యాగాలు, రక్త తర్పణాలతో ప్రజలు మెచ్చిన పార్టీగా వారి గుండెల్లో చెరగని మద్ర వేసుకుని ముందుకు సాగుతోంది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం సిపిఐ చేసిన, చేస్తున్న అనేక పోరాటాలు పేదల బ్రతుకుల్లో వెలుగులు నింపాయి. నిరంకుశ నిజాంకి వ్యతిరేకంగా సాగించిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగాలు చేశారు. భూమి లేని నిరుపేదలకు 10 లక్షల ఎకరాల భూమిని సిపిఐ పంచింది. ఈ క్రమంలో నిజాం పాలన నుండి సుమారు మూడు వేల గ్రామాలకు విముక్తి కలిగించింది. అదే విధంగా చిన్నరాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యమని భావించిన సిపిఐ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తొలినాళ్ల నుండి తన గళాన్ని వినిపించింది. ఆఖరికి తెలంగాణ మలిదశ ఉధ్యమంలో పెద్దన్న పాత్ర పోషించి స్వరాష్ట్ర సాధనలో తనదైన పాత్రను కమ్యూనిస్టు పార్టీ పోషించింది. ఈ వందేళ్ల మహత్తర ఉధ్యమాల ప్రయాణంలో సిపిఐ చేసిన అనితర త్యాగాలు, అలు పెరగని పోరాటాలు అజరామరం.
జిల్లా కేంద్రం అరుణ వర్ణం: ఖమ్మం కేంద్రంగా జరిగే సిపిఐ శత వసంత ఉత్సవ ముగింపు సభను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అరుణ వర్ణంగా మారింది. లక్ష్మీ దేవిపల్లి మండలం మొదులుకుని, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లో ఎర్ర జెండాలు, తోరణాలు రెపరెపలాడుతున్నాయి. అదే విధంగా ఐదు నియోజకవర్గాల్లో ప్రతీ గ్రామంలో సిపిఐ జెండాలు, తోరణాలు ఉత్సవ శోభకు అద్దం పడుతున్నాయి. జిల్లా కేంద్రం కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ ఆర్చీ ఆకట్టుకుంటోంది. ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఉత్సవ సందడిని మరింత రెట్టింపు చేస్తోంది. మరో ప్రక్క విద్యుత్ స్తంబాలకు ఏర్పాటు చేసిన నిలువెత్తు బోర్డులు ఆకట్టుకుంటుండగా, విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సైన్ బోర్డులు రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులను వెదజల్లుతుండగా ఆ ప్రాంతమంతా అరుణ వర్ణాన్ని సంతరించుకుంటోంది.
జిల్లా నుండి 70 వేల మంది : ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ కళాశాల మైధానంలో సిపిఐ శంత వసంత ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా 70 వేల నుండి 1 లక్ష మంది వరకు తరలుతున్నారు. ఇందుకోసం 15వేల వాహనాలు జిల్లా వ్యాప్తంగా కదులుతున్నాయి. వాహనాల సమకూర్పుకు సంబంధించిన పనులు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల సిపిఐ నాయకత్వం పనుల్లో నిమగ్నమై ఉంది. 18వ తేదిన ఖమ్మంలో భారీ ప్రదర్శన సాగనుంది. ఇందు కోసం ఖమ్మం జిల్లా కేంద్రం నలుమూలల నుండి నాలుగు భారీ ర్యాలీలు సభా ప్రాంగణానికి పోటెత్తనున్నాయి. ఈ సందర్భంగా 10వేల మంది జనసేవాదళ్ రెడ్పర్ట్ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అనంతరం కళాశాల మైధానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు తరలివస్తున్నారు.
జిల్లా కేంద్రం అరుణ వర్ణం: ఖమ్మం కేంద్రంగా జరిగే సిపిఐ శత వసంత ఉత్సవ ముగింపు సభను పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం అరుణ వర్ణంగా మారింది. లక్ష్మీ దేవిపల్లి మండలం మొదులుకుని, కొత్తగూడెం, చుంచుపల్లి మండలాల్లో ఎర్ర జెండాలు, తోరణాలు రెపరెపలాడుతున్నాయి. అదే విధంగా ఐదు నియోజకవర్గాల్లో ప్రతీ గ్రామంలో సిపిఐ జెండాలు, తోరణాలు ఉత్సవ శోభకు అద్దం పడుతున్నాయి. జిల్లా కేంద్రం కొత్తగూడెం సూపర్ బజార్ సెంటర్లో ఏర్పాటు చేసిన భారీ ఆర్చీ ఆకట్టుకుంటోంది. ఆటో స్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఉత్సవ సందడిని మరింత రెట్టింపు చేస్తోంది. మరో ప్రక్క విద్యుత్ స్తంబాలకు ఏర్పాటు చేసిన నిలువెత్తు బోర్డులు ఆకట్టుకుంటుండగా, విద్యానగర్ కాలనీలో ఏర్పాటు చేసిన సైన్ బోర్డులు మరింత ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ సైన్ బోర్డులు రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులను వెదజల్లుతుండగా ఆ ప్రాంతమంతా అరుణ వర్ణాన్ని సంతరించుకుంటోంది.
జిల్లా నుండి 70 వేల మంది ఎస్ఆర్ అండ్ బిజిఎన్ఆర్ కళాశాల మైధానంలో సిపిఐ శంత వసంత ఉత్సవాల ముగింపు సందర్భంగా భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు జిల్లా వ్యాప్తంగా 70 వేల నుండి 1 లక్ష మంది వరకు తరలుతున్నారు. ఇందుకోసం 15వేల వాహనాలు జిల్లా వ్యాప్తంగా కదులుతున్నాయి. వాహనాల సమకూర్పుకు సంబంధించిన పనులు ఇప్పటికీ పూర్తయ్యాయి. ఆయా ప్రాంతాల సిపిఐ నాయకత్వం పనుల్లో నిమగ్నమై ఉంది. 18వ తేదిన ఖమ్మంలో భారీ ప్రదర్శన సాగనుంది. ఇందు కోసం ఖమ్మం జిల్లా కేంద్రం నలుమూలల నుండి నాలుగు భారీ ర్యాలీలు సభా ప్రాంగణానికి పోటెత్తనున్నాయి. ఈ సందర్భంగా 10వేల మంది జనసేవాదళ్ రెడ్పర్ట్ వాలంటీర్ల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలువనుంది. అనంతరం కళాశాల మైధానంలో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు 40 దేశాల నుండి ప్రతినిధులు తరలివస్తున్నారు.
ఈ సభకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సిపిఐ జాతీయ కార్యదర్శులు అమర్జిత్ కౌర్, జి.కె.కాంగో, రామకృష్ణ పాండ, అనీరాజా, గిరీష్ శర్మ, కె ప్రకాష్ బాబు, సందోష్ కుమార్, ఎంపి సంజయ్ కుమార్, వల్లా వెంకటరెడ్డి, కె రామకృష్ణ, పల్లబ్ సేన్ గుప్త, సిపిఐ జాతీయ కంట్రోల్ కమీషన్ చైర్మన్ కె నారాయణ తదితరులు హాజరు కానున్నారు.
