పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-రామవరం జామియా మసీద్ ఆవరణలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామవరం ప్రముఖ వస్త్ర వ్యాపారి సయ్యద్ అబ్దుల్ నజీర్ జాతీయ జెండాను ఎగురవేసి ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కవిత రూపంలో యువతకు సందేశం ఇస్తూ మతసామరస్యం, పరమత సహనం పాటిస్తూ కులమత భేదాలను విడనాడి దేశ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శ్రీశ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్, ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్న సయ్యద్ అబ్దుల్ నజీర్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ సదర్ కమిటీ సభ్యులు, పురప్రముఖులు పాల్గొన్నారు.
