మహారాజ్ మందిరంలో రాములు నాయక్ ఘన సన్మానం.
హిందూ పరిరక్షణకు పాటుపడాల.
పాల్వంచ, జనవరి 11:
సేవాలాల్ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకునితీసుకుని, సేవ స్ఫూర్తితో బంజారా యువత ముందుకు సాగాలని జగదాంబ సేన వ్యవస్థాపక అధ్యక్షులు తేజావత్ రాములు నాయక్ అన్నారు. మహారాష్ట్ర వాసిమా జిల్లా పౌరా దేవి సేవాలాల్ మహారాజ్ మందిరంలో పట్టణ పరిధి కరకవాగుకు చెందిన రాములు నాయక్ కు ఆదివారం ఘన సత్కారం లభించింది. రాములు నాయక్ మాట్లాడుతూ.. బంజారా ఆచార వ్యవహారాలను తూచా తప్పక పాటించాలన్నారు. హిందూ ధర్మ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సత్కరించిన సాధుసంతులు, మహారాష్ట్ర నాయకులకు రాములు నాయక్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమములో జితేందర్ మహారాజ్, శంకర్ మహారాజ్, కల్కి భగవాన్, పట్టు రాములు, ధరావత్ కృష్ణ నాయక్, మాలు సాద్, యాకూసాదు, సాధు సంతులు పాల్గొన్నారు.
