మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి: కాంగ్రెస్ నేతల పిలుపు
పరివర్తన అవాజ్ ,కొత్తగూడెం ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రివర్యులు గౌ. శ్రీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామా సహాయం రఘురాం రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో నిర్వహించనున్న ముగ్గుల పోటీలను ప్రతి మహిళ పాల్గొని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆదివారం కొత్తగూడెం బూడిదగడ్డలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కనుకుంట్ల కుమార్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ముగ్గుల పోటీ పోస్టర్లను ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి, కనుకుంట్ల కుమార్ మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమం మరింత వైభవంగా సాగుతుందని తెలిపారు.
అదేవిధంగా రాబోయే కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో అనుసరించాల్సిన విధానాలపై కాంగ్రెస్ నేతలతో విస్తృతంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎం.ఏ. రజాక్, జిల్లా మైనారిటీ కార్యదర్శి ఎం.డి. గౌస్ పాషా, కనుకుంట్ల వెంకటరమణ, మాజీ కౌన్సిలర్లు పరమేష్ యాదవ్, మదా శ్రీరాములు, సోమిరెడ్డి, ఎం.డి. పాషా భాయ్, ఎం.డి. అక్బర్, మున్నా, షేర్, ఏసు రత్నం, బసాబోయిన శాంతి, భారతి, దుర్గి లత, సమ్మయ్య, అనూష, మాదాసు మమత, చి. రాజేశ్వరి, భాసీద్ ఖాన్, ఈసం సుశీల తదితరులు పాల్గొన్నారు ఎన్

