
సమస్యలతో పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం చేకూరుతుందనే భరోసా కల్పించాలి*
పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:-జిల్లా ఎస్పీ రోహిత్ రాజు పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్ను సోమవారం ఆకస్మికంగా సందర్శించడం జరిగింది.ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.5S అమలులో భాగంగా పోలీస్ స్టేషన్ రికార్డులను ఒక క్రమ పద్దతిలో అమర్చుకోవాలని అన్నారు.అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను పరిశీలించి,పలు కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.వర్టికల్స్ వారీగా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తించే అధికారులు,సిబ్బంది పనితీరును పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లోని అధికారులు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.డయల్ 100 ఫోన్ రాగానే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేకూర్చాలని సూచించారు.పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ప్రమాద నివారణా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయాలని తెలిపారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.అనంతరం అక్కడ విధులలో ఉన్న సిబ్బంది సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ సీఐ సతీష్,ఎస్సై శ్రీనివాస్,టీజీఎస్పీ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.
