పోలింగ్ వేళ 21వ డివిజన్లో ఉత్సాహభరిత వాతావరణం
పరివర్తన అవాజ్, కొత్తగూడెం:మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సందర్భంగా 21వ డివిజన్లో ఈ రోజు పోలింగ్ ఉత్సాహభరితంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ బూతులు నంబర్లు 66, 67, 68, 69 పరిధిలో ఓటర్ల రద్దీ కనిపిస్తోంది. ఈ సందర్భంగా సొసైటీ మాజీ చైర్మన్ మండే వీర హనుమంతరావు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య బూత్ల వద్ద ఓటర్లను కలిసి తమ మద్దతు అభ్యర్థి చింతలపూడి శ్రావణికి ఓటు వేయాలని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
ప్రజాస్వామ్య పండుగలో ప్రతి ఓటు భవిష్యత్తును తీర్చిదిద్దేదని, 21వ డివిజన్ అభివృద్ధి దిశను నిర్ణయించేది ఈరోజు ఓటేనని వారు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజల ఆశయాల సాధన కోసం శ్రావణిని గెలిపించాలని కోరారు.
“ఒక్కో ఓటు మార్పుకు బాటలు వేస్తుంది. ప్రతి కుటుంబం పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి” అని పిలుపునిచ్చారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగుతున్నందున ఎలాంటి అపోహలు లేకుండా ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. 21వ డివిజన్లో ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందన్నదిపై ఆసక్తి నెలకొనగా, పోలింగ్ ముగిసే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.
Related Posts
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
© 2026 Parivarthana Awaaz . Designed by Creativals.com.
