పరివర్తన అవజ్ న్యూస్ ఏప్రిల్ 11 (టేకులపల్లి ):
టేకులపల్లి మండల కేంద్రంలో Jyotirao Phule 199వ జయంతిని ఏపీఎంకే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎంకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెంతెన ప్రభాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల సతీష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిరావు పూలే మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సంస్కర్త, రచయిత మరియు విప్లవాత్మక నాయకుడని పేర్కొన్నారు. ఆయన తన సహచరురాలు Savitribai Phuleతో కలిసి స్త్రీల విద్య, దళిత వర్గాల అభ్యున్నతి, అంటరానితనం నిర్మూలన కోసం నిరంతరం పోరాటం చేశారని తెలిపారు.
1873లో సత్యశోధక సమాజ్ను స్థాపించి కులరహిత సమాజ నిర్మాణానికి కృషి చేశారని, వితంతువు పునర్వివాహాలను ప్రోత్సహిస్తూ బాల్యవివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమించారని చెప్పారు. సమాజంలో సమానత్వం తీసుకురావడానికి తన ఇంటి బావిలో అందరికీ నీటిని అందించిన గొప్ప మానవతావాది అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా నాయకులు యనగంటి రాజు, బీఎస్పీ జిల్లా నాయకులు కాళ్ళ రంజిత్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షులు ఎట్టి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు
