పరివర్తన అవాజ్,కొత్తగూడెం:-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదువుతూ టెట్ పరీక్షలో అర్హత సాధించిన వై. సారయ్య (ఎంఎస్సీ, బీఈడీ) గ్రంథాలయానికి గోడ గడియారాన్ని విరాళంగా అందించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు, కార్యదర్శి కె. కరుణకుమారి సారయ్యకు శుభాకాంక్షలు తెలియజేసి, గ్రంథాలయానికి విరాళం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
గ్రంథపాలకురాలు జి. మణిమృదుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రంథాలయాన్ని ఉపయోగించి కష్టపడి చదివిన వారికి తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకొని మంచి ఉద్యోగాలు సాధించి ఉన్నత స్థానాల్లో ఎదగాలని ఆమె ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా గ్రంథాలయ చైర్మన్, కార్యదర్శి గ్రంథపాలకురాలు మణిమృదులను అభినందించారు. కార్యక్రమంలో విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
