జనవరి 19న జరిగే కార్మిక,కర్షక ఐక్య ప్రదర్శన జయప్రదం చేయండి.
–రేపాకుల శ్రీనివాస్
జిల్లా ప్రధాన కార్యదర్శి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం.
కొత్తగూడెం: 2026జనవరి 17 శనివారం: జనవరి 19వ తేదీన కొత్తగూడెం పాతడిపో నుంచి బస్టాండ్ సెంటర్ వరకు జరిగే కార్మిక, కర్షక ఐక్య ప్రదర్శనను జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ పిలుపునిచ్చారు, శనివారం నాడు జరిగిన సమావేశంలో మాట్లాడుతూ,కార్మిక,రైతు, వ్యవసాయ కార్మికుల వ్యతిరేక విధానాలను విడనాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, జనవరి 19వ తేదీన దేశ వ్యాప్తంగా కార్మికులు,రైతులు, వ్యవసాయ కార్మికులు ఐక్యంగా కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్రదర్శనలు,సభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు, బిజెపి ప్రభుత్వ విధానాల వల్ల దేశంలో పేదరికం పెరుగుతుందని అదే సమయంలో కార్పోరేట్ల సంపద విపరీతంగా పెరిగిపోయిందన్నారు, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధరల చట్టం చేయాలని అనేక ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం నూతన విద్యుత్ చట్టం, నూతన విత్తన చట్టాలను తీసుకు వచ్చి రైతులపై పెను భారాలు మోపుతుందన్నారు, కార్పోరేట్ల ప్రయోజనాలు కాపాడటం కోసం కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా మార్చిందని అన్నారు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు దొరకని రోజుల్లో పేదలందరికీ ఉపాధి కల్పించే మహాత్మాగాందీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసిందన్నారు,కొత్తగా విబి జి రామ్ జి బిల్లును ప్రతిపక్షాల గొంతు నొక్కి ఏకపక్షంగా ఆమోదించుకుని కొత్త చట్టం తెచ్చారన్నారు,ఈ విధానాలను వ్యతిరేకిస్తూ సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు కార్మికులను, రైతులను, వ్యవసాయ కార్మికులను ఐక్యం చేసి ఆందోళనా, పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చ వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ముదిగొండ రాంబాబు,బి.చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షులు, నిమ్మల వెంకన్న,బత్తుల వెంకటేశ్వర్లు ,యాసా నరేష్ పాల్గొన్నారు
