
చర్మకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్తా
చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవాడ సూరి
పరివర్తన్నవాజ్,కొత్తగూడెం:- ఫిబ్రవరి 01 సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్ గురు రవిదాస్ మహరాజ్ అని చర్మకారుల సంఘం జిల్లా అధ్యక్షులు చదలవడా సూరి అన్నారు. ఆయన మార్గం అందరికీ అనుసరణీయమని పేర్కొన్నారు. సంత్ రవిదాస్ 650వ జయంతి వేడుకలు ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ పరిధిలోని చర్మకారుల సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చదలవాడ సూరి .. సంత్ రవిదాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చర్మకార కులంలో పుట్టిన వజ్రంగా సంత్ రవిదాస్‌ను అభివర్ణించారు. మానవతా సుగంధాన్ని విరజిమ్మే కవితోద్యమం ఆయన సొంతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, మనుషులంతా ఒక్కటేనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలోనే ఇచ్చిన సంత్ రవిదాస్ గొప్ప మహానుభావుడని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం సంత్ రవిదాస్‌ను అనుసరించినట్టు చరిత్ర చెప్తున్నదన్నారు. సంత్ రవిదాస్ సేవా మార్గాన్ని రాష్ట్రంలో విస్తృత పరుస్తామని చెప్పారు. చర్మకారుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో చర్మకారులకు సంఘం గౌరవ సభ్యులు దాసరి సంజీవ్, పెద్దపూడి రాము, భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి పెట్టల సతీష్, జిల్లా ఉపాధ్యక్షుడు పెద్దపూడి నాగేంద్రబాబు, చర్మకారుల సభ్యులు బాబు, ప్రసాద్, శ్రీను, రాజేష్, ప్రభు, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
