– ఇంటింటి ప్రచారంలో ముందంజ:-
పరివర్తన అవాజ్,కొత్తగూడెం : కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా సిపిఐ నేత ఎస్కే సాబీర పాషా 29వ డివిజన్ అభ్యర్థి మాచర్ల శ్రీనివాస్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఓటర్లను ఆప్యాయంగా వలకరిస్తూ ముందుకు సాగగా, ఆయనకు పలు చోట్ల ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా పాషా మాట్లాడుతూ 29వ డివిజన్లో కార్పోరేషన్ వ్యాప్తంగా సిపిఐకి మంచి ఆదరణ లభిస్తోందని, అనుకూల పవనాలు వీస్తున్నాయని, దీంతో ప్రత్యర్ధుల సిపిఐ అభ్యర్థుల్లో గుబులు మొదలైందన్నారు. నిత్యం ప్రజలతో ఉండే సిపిఐ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం ద్వారా తమతమ ప్రాంతాలు అభివృద్ధికి నోచుకుంటాయన్నారు. ఎన్నికలు కలుషిత వాతావరణంలో సాగుతున్నాయని, ఓటర్లు మంచిచెడులు ఆలోచించాలని తెలిపారు. ఈ ఎన్నికలు మంచి చెడుల మధ్య సాగుతున్నాయని చెప్పారు. కార్పోరేషన్ పై ఎర్రజెండా ఎగురడం ద్వారా అవినీతి రహిత పాలన అందుతుందని చెప్పారు. ఈ ప్రచారంలో మున్నా లక్ష్మీ కుమారి, నేరెళ్ల రమేష్, బత్తుల నాగరాజు, సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
