
పరివర్తన అవాజ్,కొత్తగూడెం:–భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో కొత్తగూడెం 29వ డివిజన్లో సీపీఐ పార్టీకి చెందిన 25 కుటుంబాలు బిఆర్ఎస్ పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో జరిగింది.
ఈ చేరిక కార్యక్రమాన్ని స్థానిక నాయకుడు వేముల పవన్ కుమార్ సమన్వయం చేశారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చేరిన కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిలో వేముల శైలజ, వేముల రాధమ్మ, చాగంటి రవి, చాగంటి సుమ, రాంబాబు, శ్రీను, లక్ష్మి, భాగ్య, భవాని, హసీనా, శ్రీధర్, రాజ్యలక్ష్మి, రమాదేవి, పుష్ప, గోపి, సురేష్, జగదీష్, వినోద్, పిఎన్ఆర్, నాగేష్, ప్రదీప్, నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.
చేరిక కార్యక్రమంలో మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని, పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం ఉంటుందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి అందరూ కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
అదేవిధంగా వేముల పవన్ కుమార్ మాట్లాడుతూ డివిజన్ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ లక్ష్యమని, పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ చేరికతో డివిజన్లో బిఆర్ఎస్ పార్టీ మరింత బలపడిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
