పరివర్తన అవాజ్,కొత్తగూడెం
ఎస్ఎన్పీసీ డిపార్ట్మెంట్లో జూనియర్ ఇన్స్పెక్టర్గా సేవలందించిన గౌస్ మంగళ వారం పదవీ విరమణ పొందిన సందర్భంగా ఆయనకు ఘనంగా, భావోద్వేగపూర్వకంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమం ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ అభిలాష చేతుల మీదుగా, మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఫంక్షన్ కమిటీ మరియు టెంపుల్ కమిటీ సంయుక్తంగా జరిగింది.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. గౌస్ తన సేవాకాలంలో చూపిన నిజాయితీ, క్రమశిక్షణ, సహచరులతో కలిసిమెలిసి పనిచేసిన తీరు అందరికీ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆయనతో గడిపిన అనుభవాలను గుర్తుచేసుకుంటూ కార్యక్రమం ఎంతో బావో ద్వేగా వాతావరణంలో కొనసాగింది.
ఈ కార్యక్రమంలో ఎ ఐ టి యు సి ఫిట్ సెక్రటరీ జే. రాంబాబు, జూనియర్ ఇన్స్పెక్టర్ కామరాజు, జమేదార్లు కమల్ సింగ్, జయరాజు, వై. శ్రీనివాస్, సీనియర్ గార్డ్స్ ఆర్. హనోక్ రాజ్, జనార్దన్ రావు, మల్లికార్జున్, సుధాకర్, గౌస్, వి. సురేష్, ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్లు సుంకరి శ్రీనివాస్, ఈశ్వర్, నూకరాజు తదితరులు, తోటి గార్డ్స్, డ్రైవర్లు మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.
చివరిగా అందరూ కలిసి గౌస్ భవిష్యత్తు జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
