
– మరింతగా అభివృద్ధి చేస్తాను…
– గత ఐదేళ్లలో అభివృద్ధిని పరుగులు పెట్టించాను..
– మరల బరిలో ఉన్న… ఆశీర్వదించండి…
పరివర్తన అవాజ్,కొత్తగూడెం :-నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే మరలా నాకు కార్పొరేటర్ గా నిలబడే అవకాశాన్ని ఇచ్చాయని… ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని మాజీ కౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ అభ్యర్థిస్తున్నారు. గత మున్సిపాలిటీలో కౌన్సిలర్ గా ఉన్న సమయంలో ఆమె చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి ఓటర్లకు వివరిస్తున్నారు. ఈసారి కూడా అవకాశం ఇవ్వండి తమ డివిజన్ మరింతగా అభివృద్ధి చేసి చూపిస్తానంటూ ఆమె అభ్యర్థిస్తున్నారు. ఆమె చేసిన అభివృద్ధి పనుల వివరాలు ఆమె మాటల్లోనే…
56వ డివిజన్ పాత 24 వ వార్డు నాకు ఓటు వేసి నన్ను ఆశీర్వదించిన ఓటరు మహాశయులకు నమస్కారాలు… కృతజ్ఞతలతో నా ఐదు సంవత్సరాల కౌన్సిల్ సమయంలో నేను మన 24 వ వార్డు 56వ డివిజన్ ను 36 వార్డులలో లేని విధంగా అభివృద్ధి చేసిన అని చెప్పుటకు గర్వపడుతున్నాను హౌస్ నెంబర్ 4_7_17 మనుబోతుల సత్యనారాయణ ఇంటి నుండి మంగళ రాయ మల్లు ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మాణం చేయించినాను అదేవిధంగా మనుబోతుల సత్యనారాయణ ఇంటి వద్ద ఇరుకుగా ఉన్న కల్వర్టును తీయించి పెద్ద కల్వర్టుగా నిర్మించినాను.
– గవర్నమెంట్ కూలి లైన్ హై స్కూల్ నుండి కలమ్మ ఇంటి వరకు సిసి రోడ్లు నిర్మించినాము అదేవిధంగా అక్కడున్న ఇరుకుగా ఉన్న కల్వర్టును పెద్దదిగా వెడల్పుగా చేయించినాము.
– మేడిది మనోహర్ నుండి బండారి లక్ష్మీనారాయణ ఇంటి వరకు సిసి డ్రైన్ ను నిర్మించినాము.
– గోపు రామకృష్ణ ఇంటి నుండి గజ్జల సంపూర్ణ ఇంటి వరకు సిసి రోడ్డు మరియు డ్రైన్ నిర్మించినాము.
– శంకర్ నారాయణ ఇంటి నుండి బొడ్డు పోశం ఇంటి వరకు సిసి రోడ్డు డ్రైన్ న్లు నిర్మించినాము
– వేముల నరేష్ ఇంటి నుండి సంగు సత్యనారాయణ ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మించినాము
– రేషన్ షాపు ముందు రోడ్డు నిర్మించినాము
– 40 లక్షల రూపాయల వ్యయంతో భజన మందిరం నుండి స్మశాన వాటిక జంక్షన్ వరకు బీటీ రోడ్డు నిర్మించినాము
– స్మశాన వాటికలో స్మశాన వాటిక జంక్షన్ నుండి స్మశాన లోపల 40 లక్షలతో సిసి రోడ్లను నిర్మించినాము.
– అజ్మత్ కిరాణా షాపు నుండి అజమత్ కిరాణా షాపు నుండి సత్యభామ ఇంటి వరకు వెడల్పైన సిసి రోడ్డు నిర్మించిన
– కురిమిల్ల రవి ఇంటి ముందు నుండి కోరి రాజు ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మించినాము
– మోహన్ ఇంటి నుండి కారం అశోక్ ఇంటి వరకు సిసి డ్రైన్లు రోడ్లు నిర్మించిన
– పాన్ షాప్ రాజు ఇంటి నుండి కొత్తగా నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ వరకు సిసి రోడ్డు నిర్మించిన డ్రైన్లు నిర్మించినాము
– 36 వార్డులలో ఎక్కడా లేని విధంగా ఎంతమంది అడ్డుపడినా ఆటంకులు ఏర్పాటుచేసిన దృఢ సంకల్పంతో ఒక కోటి రూపాయలతో సకల సౌకర్యాలతో ఒక కమ్యూనిటీ హాల్ నిర్మించుకుంటున్నాము
– సామ్యూల్ ఇంటి ముందు సిసి రోడ్డు నిర్మించున్నాము
– శివాలయం నుండి వీర ముష్టి భవనం వరకు సీసీ డ్రైవర్ సీసీ రోడ్డు నిర్మించినాము
– పారా నంది శ్రీకాంత్ ఇంటి ముందు నుండి అరుణ ఇంటి వరకు సిసి రోడ్డు నిర్మించినాము
– శీలం శేఖర్ ఇంటి ముందు చిన్నగా ఉన్న కల్వర్టు తీయించి పెద్దదిగా వెడల్పుగా పెద్ద కల్వర్టు నిర్మించినాము
– కూలీలను స్కూల్ ఎదురుగా గల గల్లీలో సీసీ రోడ్డు వేయించినాము
– సాయి మెకానిక్ ఇంటి వద్ద నుండి సతీష్ ఇంటి వరకు సిసి రోడ్డు వేయించినాము
– గణేష్ మండపం నుండి రాచకట్లో అశోక్ ఇంటి వరకు సిసి రోడ్లు ట్రైన్లు వేయించినాము
– ఆర్.ఎం.పి గాయత్రి ఇంటి నుండి బాలయ్య ఇంటి వరకు సిసి డ్రైన్లు రోడ్లు వేయించినాము
– జెండా లైన్ నందు జెండాల చెట్టు నుండి విధులు మల్లయ్య ఇంటి వరకు సిసి డ్రైన్లు సిసి రోడ్లు నిర్మించినాము నిర్మించినాము
– సముద్రాల శ్రీనివాస్ ఇంటి నుండి అల్లి లలిత ఇంటి వరకు సిసి డ్రైన్లు సీసీ రోడ్లు నిర్మించినాము
– హమీద్ ఇంటి నుండి మైసమ్మ రమేష్ ఇంటి వరకు సిసి డ్రైన్లు రోడ్లు నిర్మించినాము
– అనిత ఇంటి నుండి గంధం సుశీల ఇంటి వరకు సిసి రోడ్లు సిసి డ్రైన్లు నిర్మించినాము
– గత 25 సంవత్సరాల నుండి విశ్వనాధ కాలనీ యందు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నరు వారి అవసరాలను తీర్చుటకు కౌన్సిల్లో పోరాడి కలెక్టర్ అనుమతులతో విశ్వనాధ కాలని వాసులకు ఒక కోటి రూపాయలతో శాశ్వత డ్రైన్ల నిర్మాణం చేయించినాము
– న్నెరసాని నీళ్లు రానప్పుడు నా వార్డు ప్రజలు పడే ఇబ్బందులను చూసి సుమారు ఆరు లక్షల 50 వేల రూపాయలతో 3 బోర్లు వేయించి మినీ వాటర్ స్కీంను ఏర్పాటు చేసి నా వార్డు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ప్రతి రోడ్డుకి నాలుగు పబ్లిక్ టాపులు ఉండే విధంగా ఎంతమంది ఎన్ని అడ్డంకులు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రతి గల్లీకి నాలుగు పబ్లిక్ టాప్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయించినాను.
– ప్రతి రోడ్డును గుర్తించే విధంగా వార్డు మొత్తం సైన్ బోర్డులు ఏర్పాటు చేయించినాను.
– హజ్మత్ కిరాణా షాపు ముందున్న రోడ్డుకి పార్టీ వర్డ్స్ ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయించినాము అదేవిధంగా భజన మంది స్మశాన వాటిక వరకు 50 లక్షలతో పార్టీ వాట్స్ లైట్లు ఏర్పాటు చేయుటకు కౌన్సిల్లో ఆమోదం పొంది టెండర్ పిలవడం జరిగింది కానీ టెండర్ పొందిన కాంట్రాక్టర్ పనులు చేయటంలో జాప్యం జరుగుతున్నది.
– అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇప్పించినాము
– అర్హులైన లబ్ధిదారులు అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాము.
– అర్హులైన పేదవారికి 75 గజాల ఖాళీ స్థలం ఇప్పించినాము.
– అర్హులైన అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పించినాము.
– అర్హులైన పేదవారికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాల ను ఇప్పిచ్చినాము. – అవసరమున్న చోట కరెంటు స్తంభాలను ఏర్పాటు చేయించి ప్రజలందరికీ కరెంటు అందుబాటులో ఉండే విధంగా వీధిలైట్లు ఏర్పాటు చేయించినము.
ఇన్ని పనులు చేయుటకు నాకు అవకాశం కల్పించి నాకు ఓటు వేసిన నా కుటుంబ సభ్యులకు నా అభిమానులకు నా అక్కాచెల్లెళ్లకు నా అన్నదమ్ములకు పేరుపేరునా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇట్లు మీ అభిమాన మాజీకౌన్సిలర్ బాలిశెట్టి సత్యభామ76 జీవో ద్వారా అర్హులైన మా వార్డు ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా ఇంట్లోనే నెట్ సెంటర్ ఓపెన్ చేయించు పట్టాలు ఇప్పించడం జరిగిందిభవిష్యత్తులో నీటి ఎద్దడి ఉండకుండా ఉండేందుకు మన విశ్వనాథ కాలనీ యందు 10 లక్షల లీటర్ల కెపాసిటీ ఒకవాటర్ ట్యాంక్ నిర్మాణం చేయించుకుంటున్నాము.
