Monday, November 23, 2026
Home People శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లు పెట్టాలి

శిలాఫలకాలపై వార్డు సభ్యుల పేర్లు పెట్టాలి

0
5

📰 Generate e-Paper Clip

గౌరవ వేతనం, హెల్త్ కార్డులు, ప్రమాద బీమా కల్పించాలని ప్రజావాణిలో ఫిర్యాదు

కామారెడ్డి పరివర్తన అవాజ్: కామారెడ్డి జిల్లాలో గ్రామ వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామ వార్డు మెంబర్స్ ఫోరం జిల్లా అధ్యక్షుడు వికాస్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. సందర్భంగా రామారెడ్డి మండల వార్డు మెంబర్స్ ఫోరం అధ్యక్షుడు చెన్నంశెట్టి ప్రశాంత్, గౌరవ అధ్యక్షుడు పిప్పిరి లింబాద్రి మాట్లాడుతూ.. గ్రామపంచాయతీల పరిధిలోని వార్డుల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలపై ఆయా వార్డుల వార్డు సభ్యుల పేర్లను కూడా తప్పనిసరిగా పొందుపరచాలని కోరినట్లు తెలిపారు.అలాగే గ్రామ వార్డు సభ్యులకు గౌరవ వేతనంతో పాటు హెల్త్ కార్డులు అందించాలని, విధి నిర్వహణలో లేదా ప్రమాదవశాత్తు మరణించిన వార్డు సభ్యుల కుటుంబాలకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించినట్లు పేర్కొన్నారు.తమ సమస్యలపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి చెట్కూరి మోహన్, ఉపాధ్యక్షుడు సత్యరాజ్, రామారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి రెడ్డి మల్లేష్, తాడ్వాయి మండల ఇన్‌చార్జి శెట్టి భాస్కర్‌తో పాటు జిల్లాలోని వివిధ గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.