Sunday, September 20, 2026
Home Politics హనుమకొండలో ఘనంగా ‘చాత్రోo కీ గూంజ్’ రాహుల్ గాంధీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసిన...

హనుమకొండలో ఘనంగా ‘చాత్రోo కీ గూంజ్’ రాహుల్ గాంధీ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేసిన హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి*

0
48

📰 Generate e-Paper Clip

 

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక :: సెప్టెంబర్ 19

హనుమకొండ : లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరిగిన దేశవ్యాప్త విద్యార్థి యువజన సంవాద ఉద్యమం “ఛాత్రోం కీ గూంజ్ – విద్యార్థుల గర్జన” సభకు మద్దతుగా హనుమకొండ డిసిసి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారి సమన్వయంతో ఈరోజు డిసిసి కార్యాలయంలో ప్రత్యక్ష ప్రసారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి సభ్యులు బస్వరాజు సారయ్య, శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షుడు అయ్యూబ్, మహిళా అధ్యక్షురాలు బంక సరళ, డీసీసీ జనరల్ సెక్రటరీ, డీసీసీ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ కమిటీ కన్వీనర్ మారంరెడ్డి కౌటిల్ రెడ్డి, కమలాపూర్ AMC చైర్మన్ తౌటం ఝాన్సీరాణి రవీందర్, స్టేట్ ఎస్సీ డిపార్ట్మెంట్ వైస్ ఛైర్మన్ గోవిందు శ్వేత, హనుమకొండ జిల్లా ఎన్. ఎస్. యు. ఐ అధ్యక్షులు వేణు చారి, అలువాల కార్తీక్ లతో పాటు పలువురు ముఖ్య నాయకులు, విద్యార్థి విభాగాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మాట్లాడుతూ* ఈరోజు మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైన, అత్యంత ప్రాముఖ్యమైన అంశం గురించి మాట్లాడుకోవడానికి సిద్ధమయ్యాం. అదే—”ఛాత్రోం కీ గూంజ్ – విద్యార్థుల గర్జన”! చరిత్రను తిరగరాసే శక్తి, సమాజంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చే సత్తా కేవలం యువతకు, విద్యార్థులకు మాత్రమే ఉంది. చరిత్రలో ఎప్పుడు ఏ అన్యాయం జరిగినా, పాలకులు ఎప్పుడు దారి తప్పినా… మొదటగా ప్రశ్నించిన గొంతుక విద్యార్థిదే అని మనమంతా గుర్తుంచుకోవాలి. నేడు మన దేశంలో విద్యా వ్యవస్థ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకవైపు రాత్రింబవళ్లు కష్టపడి చదివిన విద్యార్థుల కలలను ఛిద్రం చేస్తూ నిరంతరం జరుగుతున్న పరీక్షల పేపర్ లీకేజీలు, మరోవైపు పేద, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతున్న అధిక ఫీజులు మనల్ని వేధిస్తున్నాయి. సకాలంలో జరగని పరీక్షలు, ఉద్యోగ నియామకాల్లో అనవసరమైన ఆలస్యం వంటివన్నీ నేటి యువత భవిష్యత్తును చీకట్లోకి నెడుతున్నాయి. ఎంతో ఆశతో, కోచింగ్ సెంటర్లలో మరియు హాస్టళ్లలో నరకయాతన అనుభవిస్తూ చదువుకుంటున్న విద్యార్థులకు నేడు సరైన భద్రత కరువైంది. ఒక విద్యార్థి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. మన నిశ్శబ్దం పాలకులకు బలంగా మారకూడదు. మన హక్కుల కోసం, మన ఉజ్వల భవిష్యత్తు కోసం మనమంతా ఒక్కతాటిపైకి రావాలి. ఈ విద్యార్థుల గర్జన దేశంలోని ప్రతి మూలకు వినిపించాలి. ఢిల్లీ పీఠాలు కదిలేలా మన గొంతుకను పెంచుదాం. పరీక్షల ఒత్తిడి లేని, పేపర్ లీకేజీలు లేని, మెరుగైన విద్యా భారతదేశాన్ని నిర్మించుకోవడానికి మనమంతా భాగస్వామ్యులం అవుదాం. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న జాతీయ స్థాయి విద్యా, ఉద్యోగ సమస్యలను, వారి ఆవేదనలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే క్రమంలో రాహుల్ గాంధీ ఈ వినూత్న వేదికను నిర్మించారని కొనియాడారు. విద్యావ్యవస్థలో సంస్కరణలు, పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత చదువులు, సకాలంలో ఉద్యోగ నియామకాల కల్పన ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా యువత భవిష్యత్తుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యేక శ్రద్ధకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని ప్రగతి పథంలో నడిపేందుకు యువత కేవలం చదువులకే పరిమితం కాకుండా సామాజిక అంశాలపై అవగాహన పెంచుకుంటూ రాహుల్ గాంధీ గారి అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా ఇనగాల వెంకట్రామ్ రెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సబ్యులు, మండల, డివిజన్ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాలు పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, RGPRS నాయకులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, NSUI నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొని, లైవ్ స్ట్రీమింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.