Sunday, September 20, 2026
Home Politics సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు….అవినీతి, అక్రమాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల...

సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు….అవినీతి, అక్రమాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు…..స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి

0
16

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  సెప్టెంబర్ 19

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాల అమలు చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి  తెలిపారు.ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి  ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మసాగర్ మండలానికి సంబందించిన 36మంది కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లబ్ధిదారులకు 36లక్షల 04వేల 176రూపాయల విలువగల చెక్కులను అలాగే 33మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు 17లక్షల 11వేల 500రూపాయల విలువగల చెక్కులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి  పంపిణి చేశారు.అనంతరం ఎమ్మెల్యే  మాట్లాడుతూ… తెలంగాణ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ తెలంగాణ వనరులను దోచుకొని వేల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ఆస్తుల చిట్టాను బయటపెట్టారని తెలిపారు. తెలంగాణ వచ్చి ఒక్క కల్వకుంట్ల కుటుంబానికే ఉపయోగపడిందని అన్నారు. కేసీఆర్ కుటుంబ మొత్తానికి 2014కు ముందు ఉన్న ఆస్తులు ఎన్ని 2026లో ఉన్న ఆస్తులు ఎన్ని అని ప్రశ్నించారు. 2014లో ఒక్క ఎకరం కూడా లేదని ఎన్నికల అఫిడవిట్ లో చెప్పిన వాళ్ళు ఇప్పుడు వందల ఎకరాలు ఎలా వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. 10ఏళ్లలో వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులకు ఒక ఎకరం భూమి ఇచ్చారా…. ఒక ఉద్యోగం ఇచ్చారా అని నిలదీశారు.రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మాత్రం లేదని అన్నారు. దానికి కారణం దేవాదుల ప్రాజెక్టు ద్వారా మన రిజర్వాయర్లను నింపుకొని పంటలకు సాగు అందిస్తున్నట్లు తెలిపారు. 20ఏళ్ల క్రితం ఒక చిన్న మొక్కగా ప్రారంభించిన దేవాదులఎత్తిపోతల పథకం నేడు మహా వృక్షంగా ఎదిగి ఉమ్మడి వరంగల్ జిల్లాకే సాగు నీరు, త్రాగు నీరు అందిస్తుందని తెలిపారు. నా రాజకీయ జీవితంలో అత్యంత సంతృప్తి ఇచ్చిన పని దేవాదుల ప్రాజెక్టు అని ఒక రాజకీయ నాయకునికి ఇంతకన్నా సంతృప్తి ఏముంటుందని చెప్పారు. ఏది ఏమైనా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ రైతులకు ఈ ఖరీఫ్ లో సాగు నీరు అందించే బాధ్యత నాదని హామీ ఇచ్చారు.కల్యాణ లక్ష్మి పథకం ఒక గొప్ప పథకం అని అన్నారు. పేదింటి ఆడపిల్లల తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి పథకం కొంత ఆర్థిక వెసులుబాటును కల్పిస్తున్నదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి అంటే తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఒక లక్ష 116 రూపాయలు ఎంతో భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ రెండు సంవత్సరాల కాలంలో రైతు సంక్షేమపైన, మహిళా సంక్షేమం పైన ప్రత్యేకించి పేద వర్గాల సంక్షేమం పైన దృష్టి పెట్టి కొత్తగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా ప్రతీ ఇంటికి 200యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ షాపుల ద్వారా పేద వర్గాలకు సన్నబియ్యాన్ని పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వంటి సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. అలాగే మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పావలా వడ్డీ రుణాలతో పాటు వ్యాపార, పారిశ్రమికంగా ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పైన 8లక్షల 11వేల కోట్ల అప్పుల భారం ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి గారు పేద వర్గాల సంక్షేమనికి, సంక్షేమ పథకాల అమలుకు పెద్ద పీట వేస్తున్నారని తెలిపారు. లబ్ధిదారులు పెళ్లి జరిగిన వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న 3 నెలలలో ప్రాసెస్ పూర్తి అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో గాని, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల విషయంలో గాని, సీఎంఆర్ఎఫ్ విషయంలో గానీ, ఇతర ప్రభుత్వ పథకాల విషయంలో గాని ఎవరు కూడా ఒక్క రూపాయి వేరే వారికి ఇవ్వవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. మీకు రావలసిన ప్రభుత్వ పథకాలు మీ ఇంటికే వస్తాయని తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు నిజాయితీగా పని చేయాలని సూచించారు. ఏ ప్రభుత్వ పథకం అయిన ప్రభుత్వ పథకం అయిన అర్హులైన నిరుపేద ప్రజలకే అందాలని ఆ దిశగా మన తీరు ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపిడివో, వివిధ గ్రామాల సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.