సంక్షేమ పథకాల కోసం ఎవరికీ ఒక్క రూపాయి ఇవ్వొద్దు….అవినీతి, అక్రమాలు లేకుండా అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు…..స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక సెప్టెంబర్ 19 స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాల అమలు చేస్తున్నట్లు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు.ధర్మసాగర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణి కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ధర్మసాగర్ మండలానికి సంబందించిన 36మంది కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ లబ్ధిదారులకు 36లక్షల...