Friday, October 23, 2026
Home People శ్రీ సింహాసనేశ్వరి దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

శ్రీ సింహాసనేశ్వరి దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

0
17

📰 Generate e-Paper Clip

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి: శ్రీ సింహాసనేశ్వరి దుర్గ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శరన్నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం నిర్వహించిన శ్రీ దుర్గామాత నిమజ్జన కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, కామారెడ్డి పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించిన ఉత్సవ కమిటీ సభ్యులను చైర్ పర్సన్ అభినందించారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ మంచి జరగాలని, సమాజంలో సుఖశాంతులు, ఐకమత్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందడం సంతోషకరమని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.