Friday, October 23, 2026
Home People *ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

*ప్రజావాణి దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

0
43

📰 Generate e-Paper Clip

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, సెప్టెంబర్ 28,

జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.సోమవారం నిర్వహించిన ప్రజావాణికి మొత్తం 220
దరఖాస్తులు వచ్చాయని, వాటిలో రెవెన్యూ శాఖకు 56, జీడబ్ల్యూఎంసీకి 74, హౌసింగ్ శాఖకు 16, డీఆర్డీవో 15 రాగా ఇతర శాఖలకు సంబంధించిన 59 దరఖాస్తులు వచ్చాయి.అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖలకు వెంటనే ఎండార్స్ చేసి, సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సందర్భంగా ప్రజావాణిలో రెవెన్యూ, హౌసింగ్, జీడబ్ల్యూఎంసీ,డిఆర్డిఓ శాఖల పరిధిలో అధికంగా దరఖాస్తు వచ్చాయని కలెక్టర్ పేర్కొన్నారు.ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎల్ కిషోర్ కుమార్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) వై.వి. గణేష్, జడ్పీ సీఈవో వసంత, డీఎంహెచ్‌వో డా. రాజి రెడ్డి,కలెక్టరేట్ సూపరిడెంట్ విశ్వప్రసాద్ తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

App Icon

Install AWAAZ News App

Add to home screen for faster loading and latest updates.