Author: nunela giribabu

*శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 17* శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని గచ్చిబౌలి లో గచ్చిబౌలి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధరరావు ఆక్రమించిన రహదారి, పార్కుల విషయంపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేయడంతో హైడ్రా అధికారులు సోమవారం ఉదయం సొసైటీ స్థలానికి వెళ్లి అనుమతులేని నిర్మాణాలను కూల్చివేసింది. ఇరవై ఎకరాల లేఔట్‌లో 162 ప్లాట్లు ఉన్నా వాటిలో అధికభాగం తనవేనన్న ధోరణితో సరిహద్దులు చెరిపేసి ఇష్టానుసారం నిర్మాణాలు చేశారని ప్లాట్ యజమానులు కోర్టుకు ఆధారాలతో సహా విన్నవించగా, అడిగితే దాడులు చేసి , బెదిరింపులు గురిచేసి, తమపై తప్పుడు కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు విధించిన రూ.10 లక్షల జరిమానా విషయం గుర్తుచేసిన బాధితుల వాదనలు విన్న హైకోర్టు “లేఔట్ అంటే లేఔటే… రహదారులు ఎవరికి వ్యక్తిగత ఆస్తి కావు” అంటూ హైడ్రాకు వెంటనే పునరుద్ధరణ…

Read More

జూబ్లీహిల్స్ లో నైతికంగా బీఆర్ఎస్ పార్టీదే విజయం -రవీందర్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఈ ఎన్నిక రౌడీయిజంతో జరిగింది అక్రమాలతో గెలిచిన చరిత్ర కాంగ్రెస్ ది ఈసీ పూర్తిగా విఫలం అయ్యింది శేరిలింగంపల్లి యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ధ్వజం కేటీఆర్ నాయకత్వంలో మరింతగా జనంలోకి వెళ్తాము పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 15 జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అక్రమంగా విజయం సాధించ్చిందని శేరిలింగంపల్లి యువ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరించి ఓట్లు వేయించుకున్నారు అని మండిపడ్డారు. ఈ ఎన్నిక రౌడీయిజంతో జరిగిందని విమర్శలు గుప్పించారు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని రవీందర్ యాదవ్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.…

Read More

శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 11 మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్న 5 గురు విదేశీయులను అరెస్ట్ చేసిన ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.సీఐ శివప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరి ధిలోని న్యూ హఫీస్ పెట్ సుభాష్ చంద్రబోస్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో గుట్టూ చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఓటి, మియాపూర్ పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దాడులు నిర్వహించారు. అక్కడ తనిఖీ చేయ గా విదేశీయులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. లైబేరియా దేశం లోని మొన్రోవియా సిటీ కి చెందిన డేరియస్ (28) 2021 సంవత్సరంలో విద్యాభ్యాసం నిమిత్తం భారతదేశానికి వచ్చి మియాపూర్, సుభాష్ చంద్రబోస్ నగర్ లో ఉంటూ ఓ కళాశాలలో చదువుకుంటున్నాడు. ప్రస్తుతం ఆన్లైన్లో విద్యను అభ్యసిస్తున్నాడు. ఇతనితోపాటు కెన్య దేశానికి చెందిన ఇద్దరు…

Read More