స్వప్నలోక్ లో ఘనంగా సీతారామ కల్యాణం
{కామారెడ్డి పరివర్తన ఆవాజ్} కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్వప్నలోక్ కాలనీలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా శుక్రవారం శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని స్వప్నలోక్ కార్యవర్గం, కాలనీవాసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారని ఆలయ అర్చకులు శ్రీహర్ష తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శ్రీ రామనవమి సందర్భంగా శుక్రవారం ఉదయం ఆలయంలో అఖండ నామము, సుప్రభాతసేవ, మూల విరాట్లకు, ఉత్సవ మూర్తులకు పంచామృతాలతో అభిషేకం, మంగళస్నానం, సహస్రనామార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ, సాయంత్రం పల్లకీ సేవలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ కాసర్ల గోదావరి స్వామి, 11వ వార్డ్ కౌన్సిలర్ రాణి శ్రీనివాస్, కాలనీవాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
