నూతన విద్యా *విధానంతోనే దేశాభివృద్ధి సాధ్యం
జాతీయసెమినార్ ముగింపులో వక్తల ఉద్ఘాటన
{కామారెడ్డి పరివర్తన ఆవాజ్} ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)లో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ది నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ (ఎన్ ఈ పి)– 2020: ఏ ట్రాన్స్ఫర్మేటివ్ షిఫ్ట్ ఇన్ ఇండియా ఎడ్యుకేషన్’ అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ సెమినార్ శనివారం ఘనంగా ముగిసింది.
కళాశాల ప్రిన్సిపల్ మరియు సెమినార్ అధ్యక్షులు డాక్టర్ కె. విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ ముగింపు వేడుకలకు ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత ప్రొఫెసర్ నాయుడు అశోక్, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సభ ప్రారంభానికి ముందు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
సభకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. విజయ్ కుమార్ మాట్లాడుతూ.. “మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పులను అర్థం చేసుకోవడానికి ఇటువంటి సెమినార్లు ఎంతగానో దోహదపడతాయి. ఎన్ఈపి -2020 ద్వారా విద్యార్థులకు కేవలం థియరీ మాత్రమే కాకుండా, ప్రాక్టికల్ నైపుణ్యాలు అందుతాయి. విద్యార్థులు ఈ నూతన విధానాన్ని అందిపుచ్చుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలి” అని పిలుపునిచ్చారు.
ముఖ్య అతిథి ప్రొఫెసర్ నాయుడు అశోక్ ఎన్ఈపి 2020 కేవలం ఒక విద్యా విధానం మాత్రమే కాదు, ఇది భారతీయ విద్యా వ్యవస్థను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ఒక మార్గదర్శి ముఖ్యంగా గాంధీజీ కలలుగన్న ‘నయీ తాలిం’ అనుభవపూర్వక అభ్యాసం ఛాయలు ఈ విధానంలో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ప్రొఫెసర్ రవీందర్ రెడ్డి ప్రపంచీకరణ కాలంలో మన మూలాలను మరచిపోకుండా, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలి. మాతృభాషలో విద్యాబోధన, వృత్తి విద్యా కోర్సుల అనుసంధానం ద్వారా విద్యార్థులు స్వయం సమృద్ధి సాధించవచ్చు.
సెమినార్ కన్వీనర్ నివేదికను డాక్టర్ కె. కిష్టయ్య రెండు రోజుల చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో సమర్పించారు. ఈ సెమినార్లో ముఖ్యంగా
లింగ వివక్షత నిర్మూలన, విద్యలో సరళత డిజిటల్ ప్లాట్ఫారమ్స్ వినియోగం, మాతృభాష ప్రాముఖ్యత.
చదువు మధ్యలో ఆపిన వారు తిరిగి విద్యను కొనసాగించే అవకాశం, నైపుణ్య వృద్ధి, విలువలతో కూడిన విద్య వంటి అంశాలపై లోతైన శోధన జరిగింది.
ఈ సెమినార్లో సోషల్ సైన్సెస్, సైన్సెస్ మరియు కామర్స్ విభాగాలకు చెందిన ప్రముఖులు పాల్గొనడం విశేషం. పరిశోధనా రంగంలో ధ్రువతారలుగా నిలిచిన వివిధ విశ్వవిద్యాలయాల ఆచార్యులు, మేధావులు ఒకే వేదికపైకి చేరి జ్ఞాన మథనం చేశారు. జ్ఞాన సారథులుగా విచ్చేసిన వీరంతా విద్యార్థులకు, పరిశోధకులకు దిశా నిర్దేశం చేశారు.
నైపుణ్యాభివృద్ధిలో భాగంగా కళాశాల విద్యార్థుల నుండి చేసిన వాటిలో మహిళా సాధికారిక విభాగం నుండి జూట్ బ్యాగులు, రసాయన శాస్త్ర విభాగం నుంచి హోమ్ నీడ్స్, మత్య శాస్త్ర విభాగం నుంచి ఎక్వేరియం అతిధులకు స్వయంగా అందజేశారు.
అనంతరం శాలువా, జ్ఞాపిక మరియు పూల మొక్కలతో కళాశాల ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు మరియు పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు




