మెదక్ పట్టణంలోని రెండవ. మూడవ వార్డ్ లలో కాంగ్రెస్ పార్టీరాష్ట్ర నాయకులు ఎస్సార్ ప్రసాద్ ఇంటింటి ప్రచారం
(పరివర్తన ఆవాజ్ ) మెదక్ పట్టణంలోని రెండవ మూడవ వార్డ్ ఇంచార్జ్ కాంగ్రెస్ పాటి రాష్ట్ర నాయకులు ఎస్ ఆర్ ప్రసాద్ కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎరికాలి నరసింహులు. కందుల యశోద మైపాల్ అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ఆయన అన్నారు . అధికార పార్టీలో ఉన్న అభ్యర్థులను గెలిపించుకుంటే వార్డ్ లు అభివృద్ధి చెందుతాయని
అన్నారు ప్రస్తుతం మూడవ వార్డు పరిస్థితి దారుణంగా ఉందని గత ఐదేళ్ల నుండి అధికారంలో ఉన్న స్థానిక నాయకులు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆయన ఎద్దేవా చేశారు ఏ ఒక్క మురికి కాలువ. సీసీ రోడ్డు నిర్మించలేదని ఆయన అన్నారు అభివృద్ధి అంటే ఇంట్లో కూర్చొని చెప్పుడు కాదని అభివృద్ధి అంటే పనులు చేసి చూపించడం అని ఆయన అన్నారు. మూడవ వార్డ్ అభివృద్ధి చెందాలంటే కందుల యశోద మైపాల్ ను గెలిపించాలని రెండు సంవత్సరాల్లో అభివృద్ధి ఏందో చేసిచూపిస్తారని ఆయన అన్నారు రెండు వార్డ్ లను కాంగ్రెస్ పార్టీ గెలువబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమం లోపోటీ చేస్తున్న అభ్యర్థులు ఎరుకలినరసింహులు .కందుల యశోద మైపాల్ తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు


