హవేళి ఘణాపూర్ మండలకేంద్రంలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.
పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
(మెదక్ పరివర్తన ఆవాజ్) మెదక్ జిల్లా హవేళి ఘణాపూర్ మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా కేకు కట్ చేసి, మాజీ ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మిఠాయి పొట్లాలు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండలకేంద్రమైన హవేళి ఘణాపూర్ గ్రామసర్పంచ్ మేకల సాయిలు, ఉప సర్పంచ్ వడ్ల రాజు, వార్డు సభ్యులు, మండల నాయకులు సతీష్ రావు, రామచంద్రారెడ్డి, సాప సాయిలు, శ్రీహరి, లింగం, వెంకటి, సంతోష్,శ్రీను,రాములు, రమేష్, బిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

