గ్రామపంచాయతీఎన్నికల్లో తండ్రి గెలిస్తే కొడుకు ధర్మ భిక్షాటన?
గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలోధర్మభిక్షాటన చేసిన కుమారుడు
(పరివర్తనఆవాజ్ న్యూస్) మెదక్ జిల్లా రామాయంపేట మండల జాన్సీ లింగాపూర్ గ్రామం ఇక్కడ జరిగిన ఈ ఘటన ఈ రోజుల్లో అcరుదుగా కనిపించే మాటకు విలువ చెప్పిన రాజకీయ సంఘటనగా మారింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జాన్సీ లింగాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన మానెగల రామకృష్ణయ్య విజయం సాధిస్తే…తన మూడో కుమారుడు మానెగల భాస్కర్, ధర్మ భిక్షాటన చేస్తానని గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ…నేడు అక్షరాలా అమలైంది. తండ్రి సర్పంచ్‌గా ఎన్నికైన వెంటనే ఇచ్చిన మాటను మరిచిపోకుండా మూడో కుమారుడు మానెగల భాస్కర్ గ్రామ వీధుల్లో తల వంచి ధర్మ భిక్షాటన చేశాడు.ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలు ఓట్ల వరకే పరిమితం అనే.విమర్శలు ఉన్న వేళ మాట నిలబెట్టుకున్న ఈ ఘటన గ్రామ ప్రజలను మాత్రమే కాదు చూసిన ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తోంది. ఇది కేవలం ఓ ప్రతిజ్ఞ కాదు అంటున్నారు గ్రామస్తులు ఇది రాజకీయాల్లో విశ్వసనీయతకు నిదర్శనం హామీ అంటే బాధ్యత అనే సందేశం అంటున్నారు.నేడు రాజకీయాల్లో మాటకు విలువ తగ్గుతోందని అనుకునే సమయంలో జాన్సీ లింగాపూర్‌లో జరిగిన ఈ ఘటన రాజకీయ సంస్కృతికి కొత్తదిశచూపిందనిస్థానికులుఅభినందిస్తున్నారు.ఇది ఓ కుటుంబం చేసిన పని కాదు ఇది నమ్మకానికి నిలువెత్తు ఉదాహరణ ఇది మాట నిలబెట్టుకున్న ప్రజాస్వామ్యానికి సాక్ష్యం.

