హైడ్రా అరాచకాలను తరిమికొట్టాలి హిందూ దేవాలయాల జోలికొస్తే సహించేది లేదు…
శేరిలింగంపల్లి బీజేపీ కంటస్టెడ్ ఎంఎల్ఏ రవికుమార్ యాదవ్
శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ నవంబర్ 21 ,శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని మాదాపూర్ సున్నం చెరువులోనీ హనుమాన్ ఆలయాన్ని తొలగించేందుకు హైడ్రా అధికారుల తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ స్వామి వారిని దర్శించుకుని భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టిన బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్
గత 20 సంవత్సరాలుగా మాధాపూర్ డివిజన్ పరిధిలోని సున్నం చెరువు వద్ద ఉన్న పురాతన హనుమాన్ దేవాలయాన్ని హైడ్రా అధికారులు తొలిగించాలని చూడగ బీజేపి ఆధ్వర్యంలో వి.హెచ్.పి, భజరంగ్ దళ్ కార్యకర్తలు పెద్దఎత్తున చేరుకుని అడ్డుకోవడం జరిగింది, ఈ సందర్భంగా హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు మరియు తదనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు రాధాకృష్ణ యాదవ్ తో కలిసి పాల్గొన్న బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈ హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహిస్తున్నారు, హైడ్రా అధికారులు తొలిగించాలని చూడటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు, పెద్దలకు ఒక న్యాయం పేదలకు ఒక న్యాయం చేస్తూన్న హైడ్రా అధికారులు
తీరు సరైనది కాదని,నిన్న మొన్నటి వరకు సామాన్య ప్రజలను భయబ్రాంతులకు గురిచేసి, ఇప్పుడు హిందూ దేవాలయాల జోలికి వస్తున్నారనీ మండి పడ్డారు, పైన దేవుడు, ఇక్కడి ప్రజలు అన్ని గమనిస్తూనే ఉన్నారని,మిమ్మల్ని మీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తొలగించే రోజు దగ్గర లోనే ఉందని హెచ్చరించారు, కొన్ని నెలల క్రితం నానక్ రామ్ గూడ లోని కాళి మాత అమ్మవారి ఆలయాన్ని ఇలాగే తొలగించాలని నోటీసులు ఇస్తే అడ్డుకున్నాం , ఇప్పుడు సున్నం చెరువు హనుమాన్ టెంపుల్ జోలికి వచ్చారని,రోడ్ మధ్యలో ఉన్న దర్గాలు, ముస్లిం స్మశాన వాటికలను, పక్కనే ఉన్న దర్గా జోలికి వెళ్ళే దమ్ము లేని మీకు హిందువులు ఎంతో పవిత్రంగా పూజలు చేసే దేవుళ్ళు అంటే చులకనా అని అన్నారు, హిందూ దేవాలయాల జోలికి వస్తే సహించేది లేదనీ ప్రతి దగ్గర అడ్డుకుని తీరుతామని, విగ్రహాలు, దేవాలయాలు తొలగించేందుకు హైడ్రా అధికారులు చూపుతున్న అత్యుత్సాహం, కబ్జాలు, ఆక్రమణల మీద దృష్టి పెడితే అందరూ హర్షిస్తారన్నారు, ఇంకోక్కసారి ఇలా జరిగితే హిందువులందరూ ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి,మహేందర్ యాదవ్, శివ కుమార్ యాదవ్, లింగస్వామి,నరేష్, రాము యాదవ్,సుమన్, శీను నాయక్, స్రవంతి, బజరంగ్ దల్,విశ్వహిందూ పరిషత్ వారు పాల్గొన్నారు

