జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పలు ప్రాంతాల్లో ఘర్షణలు
పరివర్తన అవాజ్ హైదరాబాద్:నవంబర్ 11 జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఇవాళ(మంగళవారం) ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అయితే, పలు సమస్యాత్మక ప్రాంతాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ఈ క్రమంలో ఇరు పార్టీల నేతలనుఆయాప్రాంతాలనుంచిపంపించివేశారుపోలీసులు.బోరబండలోని పలు పోలింగ్ స్టేషన్‌లలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేత బాబా ఫసియుద్దీన్ దాడి చేశారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో టేబుల్ పెట్టుకోకుండా బాబా ఫసియుద్దీన్ దౌర్జన్యం చేయటంపై పోలీసుల తీరును మాగంటి సునీత గోపీనాథ్ ఖండించారు. అధికార కాంగ్రెస్‌కి మద్దతుగా పోలీసులు పనిచేస్తున్నారని మాగంటి సునీత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.బీఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతల ఫిర్యాదు..బోరబండలో పోలింగ్ స్టేషన్ల వద్ద కరపత్రాలతో బీఆర్ఎస్ నేతల ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ రూల్స్‌కు విరుద్ధంగా కేసీఆర్ ఫొటోలతో ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు కాంగ్రెస్ నేతలు.కాంగ్రెస్ నేతలకు మాగంటి సునీత వార్నింగ్…బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేసిన, బెదిరించిన ఊరుకునే ప్రసక్తేలేదని కాంగ్రెస్ నేతలను మాగంటి సునీత హెచ్చరించారు. పోలీసులు ఎవరికి సపోర్ట్ చేయకుండా న్యూట్రల్‌గా ఉండి ఎన్నికలను సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. బాబా ఫసియుద్దీన్ దాడులకు పాల్పడుతున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని స్పష్టం చేశారు.షేక్‌పేట్ డివిజన్‌లో…మరోవైపు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్‌పేట్ డివిజన్‌లో ఉప ఎన్నికలు ప్రారంభమయ్యాయి. షేక్‌పేట్ ప్రభుత్వ పాఠశాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ స్టేషన్‌లో ఏర్పాట్ల సరళిని మాగంటి సునీత పరిశీంచారు. అయితే, సునీతని పోలింగ్ స్టేషన్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు పోలీసులు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తనను బలవంతంగా పంపిస్తున్నారని పోలీసులపై ఆమె ఫైర్ అయింది. పోలీసుల ఏకపక్షంగా వ్యవహారిస్తున్నారని సునీత, స్థానిక కార్పొరేటర్ హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంగళరావు నగర్ డివిజన్‌లో పర్యటించిన నవీన్ యాదవ్జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు పలు పోలింగ్ కేంద్రాలను కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ పర్యవేక్షించారు. వెంగళరావు నగర్ డివిజన్ బూత్ నెం 205, జవహర్ నగర్‌లో ఓటర్లకు డబ్బులు పంచుతూ స్థానిక కాంగ్రెస్ నాయకుడు అడ్డంగా దొరికారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. ఈ క్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకుడిని పట్టుకొని అధికారులకు అప్పజెప్పారు..రహమత్ నగర్‌లోని పలు పోలింగ్ స్టేషన్‌లని తెలంగాణ ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పరిశీలించారు. ఈ క్రమంలో పోలింగ్ స్టేషన్ల వద్ద స్థానికేతర కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఓటు లేని వ్యక్తులు.. నియోజకవర్గంలో ఉండకూడదని ఎన్నికల నిబంధనలు ఉన్న కూడా కాంగ్రెస్ నేతలు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లను కాంగ్రెస్ నేతలు ప్రలోభ పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు..

