లింగంపల్లి భస్తి దవాఖానను సందర్శించిన హరీశ్ రావ్
శేరిలింగంపల్లి పరివర్తన అవాజ్ అక్టోబర్ 21, మాజీ మంత్రి హరీశ్ రావ్ మంగళవారం నాడు లింగంపల్లి గ్రామంలో భస్తి దవాఖానను సందర్శించారు దవాఖాన నిర్వహిస్తున్న తీరు ప్రజలకు చేస్తున్న వైద్యం వివరాలను పరిశీలించారు అయితే భస్తి దవాఖాన నిర్వహణలో పూర్తిగా నిర్లక్ష్యం కనిపిస్తుందని అవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా హరీష్ రావ్ మాట్లాడుతూ బస్తి దవాఖానాల్లో ప్రజలకు సుస్తీ చేస్తే చికిత్స చేయాల్సిన దవాఖానల్లో మందులు,టెస్టులు అందుబాటులో లేవని దవాఖాన సిబ్బందికి కూడా సరిగ్గా జీతాలే అందడం లేదని తెలంగాణ వ్యాప్తంగా బస్తీ దవాఖానలకే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో సుస్తీ చేసిందని విమర్శించారు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేదల సౌలభ్యం కోసం కేసీఆర్ ఈ బస్తీ దవాఖానాలను ప్రజల ఆరోగ్యం కోసం ఏర్పాటు చేసి 110 రకాల మందులను 134 రకాల టెస్టులను ఉచితంగా చేసేవారని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో బస్తీ దవాఖానల వ్యవస్థకు పూర్తిగా సుస్తీ చేసిందని అన్నారు ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి ముఖ్యనాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు

