పూలే విగ్రహ ధ్వంసం పై బీసీల ఘాటు హెచ్చరిక – నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలి”
- మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితున్ని కఠినంగా శిక్షించాలి…
- బీసీల ఆరాధ్యదైవం మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ధ్వంసం చాలా బాధాకరం..
- విగ్రహం ధ్వంసం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు..
- బీసీలపై ప్రేమ అంటున్న కాంగ్రెస్ సర్కార్ ఈ విషయంలో సమాధానం చెప్పి తీరాలి…
- వరంగల్ జిల్లా బిజెపి అధ్యక్షులు గంట రవికుమార్..
వరంగల్ జిల్లా ప్రతినిధి అక్టోబర్ 21 (పరివర్తన ఆవాజ్) వరంగల్ నగరంలో ఉర్సు దర్గా ప్రాంతంలోని ఆటో స్టాండ్ దగ్గర ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని అర్ధరాత్రి ధ్వంసం చేసిన గుర్తుతెలియని దుండగులు. విషయం తెలుసుకున్న వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించి ఘటనకు బాధ్యులన్నీ వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఇటు పోలీసులను అటు ప్రభుత్వాన్ని వరంగల్ బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు.అదే ప్రాంతంలో ఇంతకు ముందు కూడా గుర్తు తెలియని వ్యక్తులు పూలే విగ్రహాన్ని ధ్వంసం చేస్తే నూతన విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది.. మళ్ళీ ధ్వంసం చేయడం ఇదీ రెండో సారి., ఇప్పటికయినా సామాజిక విప్లవమూర్తి మహాత్మ జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని అర్ధరాత్రి వేళ ధ్వంసం చేసిన దుండగులను గుర్తించి పోలీస్ అధికారులు చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ డిమాండ్ చేశారు.లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ మరియు బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుంది పదేపదే ఇలాంటి మహాత్ముల విగ్రహాలు కూల్చుతున్న అటు ప్రభుత్వం ఇటు పోలీసులు చూసి చూడనట్టు వ్యవహరించి బీసీల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితిని కొనితెచ్చుకోవద్దని ఇప్పటికైనా తక్షణమే స్పందించి నిందితులను కఠినంగా పోలీసులు శిక్షించాలని గంట రవికుమార్. ప్రభుత్వాన్ని కోరారు
మహాత్ముల విగ్రహాలు కూల్చడం పై కఠినంగా వ్యవహరించాలని ఇది మొదటిసారి కాదు రెండవసారి కావడం బాధాకరం ఇప్పటికైనా కఠినంగా వ్యవహరిస్తే తప్ప ఇలాంటి వాటికి చరమగీతం పాడలేరు పోలీసులు కాబట్టి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని లోతుగా అధ్యయనం చేసి సీసీ కెమెరాలు నమోదైన దృశ్యాలను సుమోటోగా తీసుకొని తక్షణమే నిందితుడిని కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.

