పేకాట ఆడుతూ పట్టుబడిన రాజకీయ ప్రముఖులు,
పరివర్తన అవాజ్, పేకాట ఆడుతూ పట్టుబడిన రాజకీయ ప్రముఖులు
తెలంగాణ : వరంగల్ కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో పేకాట ఆడుతూ రాజకీయ ప్రముఖులు పట్టుబడ్డారు. ఆదివారం రాత్రి కొత్తవాడలోని మాజీ ఎమ్మెల్యే దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. మాజీ ఎమ్మెల్యే దోనెపూడి, గూడూరు హరిబాబు, సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, పలువురు కార్పొరేటర్లు పట్టుబడినట్లు తెలుస్తోంది. వారి నుంచి రూ.3,68,530 నగదు, 15 సెల్ఫోన్లు, పేకాట కార్డులు, టోకెన్లను స్వాధీనం చేసుకున్నట్టు టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు

